Eden Gardens Test: మూడో రోజే మా బ్యాగులు సర్దుకున్నాం కానీ.. చారిత్రక ఈడెన్ గార్డెన్స్ టెస్టుపై బదానీ-eden gardens test in 2001 as hemang badani remembers they packed the bags on day 3 itself ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Eden Gardens Test In 2001 As Hemang Badani Remembers They Packed The Bags On Day 3 Itself

Eden Gardens Test: మూడో రోజే మా బ్యాగులు సర్దుకున్నాం కానీ.. చారిత్రక ఈడెన్ గార్డెన్స్ టెస్టుపై బదానీ

Hari Prasad S HT Telugu
Mar 14, 2023 04:57 PM IST

Eden Gardens Test: మూడో రోజే మా బ్యాగులు సర్దుకున్నాం కానీ అంటూ చారిత్రక ఈడెన్ గార్డెన్స్ టెస్టుపై మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సరిగ్గా 22 ఏళ్ల కిందట ఇదే రోజు (మార్చి 14) లక్ష్మణ్, ద్రవిడ్ అద్భుతమే చేసిన విషయం తెలిసిందే.

రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్
రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్

Eden Gardens Test: ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ అనగానే అందరికీ ముందు లక్ష్మణ్, ద్రవిడే గుర్తుకు వస్తారు. 2001లో ఆస్ట్రేలియాపై ఈ ఇద్దరూ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడారు. అప్పటికే తొలి టెస్టు ఓడిపోయి.. రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న దుస్థితిలో ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు ఏకంగా 376 పరుగుల భాగస్వామ్యంతో ఇండియాకు చారిత్రక విజయం సాధించి పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

టెస్టు క్రికెట్ లో ఫాలో ఆన్ ఆడుతూ గెలిచిన ఐదు సందర్భాల్లో అదీ ఒకటి. ఆ చారిత్రక టెస్టును గుర్తు చేసుకుంటూ అప్పటి టీమిండియా సభ్యుడు హేమంగ్ బదానీ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ఇక తమ పని అయిపోయినట్లు భావించి మూడో రోజే బ్యాగులు సర్దుకొని ఎయిర్ పోర్టుకు పంపించినట్లు అతడు చెప్పాడు.

"మూడో రోజు ముగిసే సమయానికే మేము బ్యాగులు సర్దుకున్న విషయం చాలా మందికి తెలియదు. ఆ బ్యాగులను ఎయిర్ పోర్టుకు పంపించి.. మేము గ్రౌండ్ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లాలన్నది ప్లాన్. కానీ ఈ ఇద్దరూ మాంత్రికుల్లాగా బ్యాటింగ్ చేసి ఆ రోజంతా వికెట్ పడకుండా ఆడారు" అని బదానీ గుర్తు చేసుకున్నాడు.

మరో ట్వీట్ లో గ్రౌండ్ నుంచి హోటల్ కు వెళ్లిన తర్వాత తాము పడిన ఇబ్బందులను చెప్పాడు. "మేము హోటల్ కు వెళ్లిన తర్వాత మా బ్యాగులు లేవు. రాత్రి 9 గంటల వరకూ మేము మా మ్యాచ్ డ్రెస్సులలోనే ఉన్నాం. రాత్రి డిన్నర్ కూడా వాటిపైనే చేశాం" అని బదానీ వెల్లడించాడు.

ఆ చారిత్రక మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 445 రన్స్ చేసింది. ఆ తర్వాత ఇండియా కేవలం 171 పరుగులకే ఆలౌటైంది. లక్ష్మణ్ 59 రన్స్ చేశాడు. ఫాలో ఆన్ ఆడాల్సి రావడంతో ఈ మ్యాచ్ కూడా ఓడినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ రెండో ఇన్నింగ్స్ లో లక్ష్మణ్ (281), ద్రవిడ్ (180) ఎవరూ ఊహించని అద్భుతమే చేశారు.

ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 376 రన్స్ చేయడంతో రెండో ఇన్నింగ్స్ ను ఇండియా 7 వికెట్లకు 657 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. నాలుగో రోజంతా వీళ్లు వికెట్ పడకుండా ఆడటం విశేషం. తర్వాత 384 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 171 పరుగుల తేడాతో ఓడిపోయింది. హర్భజన్ సింగ్ ఆరు వికెట్లు తీసుకున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం