Dinesh Karthik Comments on Chahal: టీ20 వరల్డ్ కప్‌లో చాహల్ ఉండుంటే ఇంకా నష్టం జరిగేదే.. దినేశ్ కార్తిక్ షాకింగ్ కామెంట్
Dinesh Karthik Comments on Chahal: టీమిండియా సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తిక్.. యజువేంద్ర చాహల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో అతడు తుది జట్టులో లేకపోవడానికి కారణం కోచ్, కెప్టెన్ నిర్ణయాలేనని స్పష్టం చేశాడు.
Dinesh Karthik Comments on Chahal: టీమిండియాకు 2022లో పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఏడాది ప్రారంభంలోనే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఓడిపోయింది. చివర్లో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇవి కాకుండా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ నుంచి మధ్యలోనే నిష్క్రమించింది. ముఖ్యంగా పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. రోహిత్ శర్మ సహా మొత్తం జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాల తప్పిదాల కారణంగానే ఇలా జరిగిందని మండిపటడ్డారు. ముఖ్యంగా భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మ్యాచ్‌లోనూ అతడిని ఆడించకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు.
ట్రెండింగ్ వార్తలు
తాజాగా టీమిండియా సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తిక్ ఈ విషయంపై స్పందించాడు. ఓ ఆటగాడిపై కోచ్, కెప్టెన్‌కున్న నమ్మకం కారణంగానే ఆ నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేశాడు.
"ఈ నిర్ణయాలు పూర్తిగా కోచ్, కెప్టెనే తీసుకున్నారు. ఓ ఆటగాడిపై ఉన్న అమితమైన నమ్మకం కారణంగా ఇలా జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ టోర్నమెంట్‌ను బాగా ఆరంభించాడు. బహుశా సరిగ్గా ముగించలేదనిపిస్తుంది. కానీ అతడి స్థానంలో చాహల్‌ను తీసుకున్నట్లుయితే కచ్చితంగా ఎక్కువ నష్టం జరిగేదే. ఇది ఒక ఆసక్తికరమైన ఎంపిక. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే అంతకంటే ఆసక్తిగా ఉంది" అని దినేశ్ కార్తిక్ అన్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2022లో రవిచంద్రన్ అశ్విన్ ఆరు మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీశాడు. 21 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో భారత్ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ బ్యాటర్లు అలెక్స్ హేల్స్(86), జాస్ బట్లర్(80) అర్ధశతకాలు చేసి 16 ఓవర్లలోనే ఛేదించారు. వికెట్లేమి కోల్పోకుండా జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. అనంతరం ఫైనల్‌లో పాకిస్థాన్‌ను కూడా ఓడించి ఇంగ్లీష్ జట్టు టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.