Telugu News  /  Sports  /  Dinesh Karthik Says Pujara Realizes That Ipl Is Not His Cup Of Tea
పుజారాపై దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు
పుజారాపై దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు (ANI )

Dinesh Karthik About Pujara: ఐపీఎల్ అతడి ఫార్మాట్ కాదు.. పుజారాపై దినేశ్ కార్తిక్ సంచలన వ్యాఖ్యలు

17 December 2022, 15:23 ISTMaragani Govardhan
17 December 2022, 15:23 IST

Dinesh Karthik About Pujara: ఛతేశ్వర్ పుజారాపై దినేశ్ కార్తిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాతో సెంచరీతో ఆకట్టుకున్న పుజారాను ఐపీఎల్‌లో తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్న తరుణంలో కార్తిక్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్ పుజారా ఫార్మాట్ కాదని తెలిపాడు.

Dinesh Karthik About Pujara: ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా అడుగులేస్తుంది. శుక్రవారం భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లోనూ 258 పరుగుల భారీ స్కోరు సాధించడంతో బంగ్లా లక్ష్యం 513 పరుగులుగా ఉంది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో పాటు సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా సెంచరీతో విజృంభించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ముఖ్యంగా పుజారా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 130 బంతుల్లోనే 102 పరుగులు చేయడంతో అభిమానులు అతడి ఆటకు ముగ్ధలయ్యారు. తన టెస్టు కెరీర్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేయడంతో అతడిని ఐపీఎల్‌లో తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. తాజాగా పుజారా ప్రదర్శనపై టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తిక్ స్పందించాడు. ఐపీఎల్ అతడి ఫార్మాట్ కాదని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

"నిజంగా చెప్పాలంటే అతడికి ఐపీఎల్‌పై ఆసక్తి లేదని నేను అనుకోను. చాలా కాలం పాటు ప్రయత్నించాడు. కానీ అది తన ఫార్మాట్ కాదని గ్రహించి తర్వాత వదిలేశాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్‌లో గడుపుతాడు. క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటాడు. అతడేదో నిరపించుకోడానికి ప్రయత్నించడం కాదు. అతడు ఏ ఫార్మాట్లో ఆడితే బాగుంటుంది, ప్రజలకు ఎక్కడ నచ్చుతుంది అనేది విషయం. అతడికి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసు. ఐపీఎల్ అతడి లాంటి వారికి కాదని నేను అనుకుంటున్నాను. ఆ విషయం అతడు కూడా తెలుసుకున్నాడు" అని దినేశ్ కార్తిక్ స్పష్టం చేశాడు.

"ఐపీఎల్ సమయంలో ఇంగ్లాండ్‌లో ఆడటాన్ని పుజారా ఇష్టపడతాడు. అతడు తన కుటుంబాన్ని కూడా అక్కడికి తీసుకెళ్తాడు. తనకంటూ అక్కడ సముచిత స్థానాన్ని కనుగొన్నాడు. మీరు గెలవలేని యుద్ధంలో పాలుపంచుకున్నప్పుడు అది కాకుండా వేరే యుద్ధంలో పోరాడాలి. పుజారా ఆ మార్గంలోనే వెళ్తున్నాడు." అని దినేశ్ కార్తిక్ అని అన్నాడు.

పుజారా చివరగా ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగమయ్యాడు. అయితే ఆ ఫ్రాంఛైజీ తరఫున ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. టెస్టు క్రికెట్‌పైనే తన ఫోకస్ పెట్టిన పుజారా ఆ దిశగా మరింత కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్‌తో టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా భారత్.. బంగ్లా ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్య ఛేదనలో బంగ్లా 238 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే కి ఇంకా 275 పరుగులు చేయాలి.