Dinesh Karthik | దినేష్‌ కార్తీక్‌కు ఐపీఎల్‌ నిర్వాహకుల వార్నింగ్‌-dinesh karthik reprimanded for breaching the ipl code of conduct ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Dinesh Karthik Reprimanded For Breaching The Ipl Code Of Conduct

Dinesh Karthik | దినేష్‌ కార్తీక్‌కు ఐపీఎల్‌ నిర్వాహకుల వార్నింగ్‌

Hari Prasad S HT Telugu
May 27, 2022 03:30 PM IST

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ బెస్ట్‌ ఫినిషర్‌గా మారిన దినేష్‌ కార్తీక్‌.. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో వ్యవహరించిన తీరుకుగాను ఐపీఎల్‌ నిర్వాహకులు మందలించారు.

లక్నోతో మ్యాచ్ లో దినేష్ కార్తీక్
లక్నోతో మ్యాచ్ లో దినేష్ కార్తీక్ (PTI)

ముంబై: ఐపీఎల్‌ ఎలిమినేటర్‌లో రజత్‌ పటీదార్‌ సెంచరీతోపాటు చివర్లో కార్తీక్‌ మెరుపులు కూడా ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాయి. అయితే ఇదే మ్యాచ్‌లో కార్తీక్‌ ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లెవల్‌ 1 తప్పిదం కూడా చేశాడు. "రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ ప్లేయర్‌ దినేష్‌ కార్తీక్‌ను మందలించాం. లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అతడు ఐపీఎల్ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించడమే దీనికి కారణం" అని ఐపీఎల్‌ అధికారిక ప్రకటన తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

కార్తీక్‌ ఉల్లంఘనను లెవల్‌ 1 తప్పిదంగా పరిగణించారు. ఈ విషయంలో మ్యాచ్‌ రిఫరీ నిర్ణయమే ఫైనల్‌ అవుతుంది. తాను ఆ తప్పిదానికి పాల్పడినట్లు కార్తీక్‌ కూడా అంగీకరించాడు. అయితే కార్తీక్‌ చేసిన తప్పిదం ఏంటన్నది మాత్రం ఐపీఎల్‌ అధికారిక ప్రకటన వెల్లడించలేదు. బహుశా ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో కార్తీక్‌ వ్యవహరించిన తీరుకు కావచ్చు.

అవేష్ ఖాన్‌ వేసిన ఆ ఓవర్లో ఓ బాల్‌ను కొట్టడానికి ఆఫ్‌స్టంప్‌ వైపు పూర్తిగా జరిగినా.. బంతి అందలేదు. దీంతో కార్తీక్‌ ఆ ఫ్రస్ట్రేషన్‌లో గట్టిగా అరిచాడు. ఈ మ్యాచ్‌లో కార్తీక్‌ 23 బాల్స్‌లోనే 37 రన్స్‌ చేశాడు. అంతేకాదు రజత్‌ పటీదార్‌తో కలిసి ఐదో వికెట్‌కు కేవలం 41 బాల్స్‌లోనే 92 రన్స్‌ జోడించాడు. ఈ పార్ట్‌నర్‌షిప్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

WhatsApp channel

టాపిక్