Shikhar Dhawan: భార్య నుంచి వేధింపులు.. శిఖర్ ధావన్‌కు విడాకులు.. కోర్టు షరతులు ఇవే!
Shikhar Dhawan Divorce: టీమిండియా పాపులర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు తాజాగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. శిఖర్ ధావన్ భార్య ఆయేషా ముఖర్జీ క్రూర పవర్తరన కారణంగానే డివోర్స్ ప్రకటిస్తున్నట్లుగా న్యాయస్థానం వెల్లడించింది.
Shikhar Dhawan Ayesha Mukherjee Divorce: భారత క్రికెట్ ప్లేయర్ శిఖర్ ధావన్‌కు ఆయన భార్య ఆయేషా ముఖర్జీ నుంచి ఢిల్లీలోని కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. 2012 సంవత్సరం అక్టోబర్‌లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్న శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించాడు. తన భార్య మానసికంగా వేధిస్తోందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు శిఖర్ ధావన్.
ట్రెండింగ్ వార్తలు
నిజం కాదని
శిఖర్ ధావన్ విడాకుల పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు దంపతులిద్దరికి విడాకులు మంజూరు చేసింది. ఆయేషా ముఖర్జీపై శిఖర్ ధావన్ చేసిన ఆరోపణనలను సమర్థించిన కోర్టు కేసులో ప్రాథమికంగా ఆమె క్రూర పవర్తన కారణంగానే విడాకులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. ధావన్ ఆరోపణలు నిజం కాదని ఆయేషా నిరూపించుకోలేకపోయినట్లు కోర్టు తెలిపింది. తన ఒక్కగానొక్క కుమారుడికి దూరంగా ఉండాలని శిఖర్ ధావన్‌ను భార్య ఆయేషా మానసికంగా వేధించినట్లు కోర్టు నమ్మింది.
ఒత్తిడి చేసినట్లు
"ఆయేషా మొదట శిఖర్‌తో కలిసి భారత్‌లో ఉండేందుకు ఒప్పుకుంది. కానీ, తన మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని చూసుకునేందుకు ఆస్ట్రేలియాలోనే ఆయేషా ఉండిపోయింది. దీంతో ధావన్ తన కుమారుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ధావన్ తన సొంత డబ్బుతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన 3 ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఆయేషా ఒత్తిడి చేసినట్లు కోర్టు నిర్ధారణకు వచ్చింది" అని తీర్పులో న్యాయస్థానం పేర్కొంది.
ఉద్దేశపూర్వకంగా
తీర్పులో న్యాయస్థానం ఇంకా కొనసాగిస్తూ "ఒక ఆస్తిలో 99 శాతం వాటా, మిగతా రెండు ఆస్తుల్లో కో ఓనర్‌షిప్ కావాలని ఆయేషా డిమాండ్ చేసినట్లు ధావన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలను ఆమె వ్యతిరేకించలేదు. అందువల్ల ఇవన్నీ నిజాలే అని కోర్టు గుర్తించింది. అంతేకాకుండా శిఖర్ ధావన్ పరువుకు భంగం కలిగించేలా ఆయేషా ఉద్దేశపూర్వకంగా తోటి క్రికెటర్స్, బీసీసీఐ, ఐపీఎల్ జట్టు యాజమాన్యానికి తప్పుడు సందేశాలు పంపించినట్లు విచారణలో తేలింది. మొదటి భర్త సంతానం అయిన కుమార్తెల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం కూడా ధావన్ నుంచి డబ్బు డిమాండ్ చేసినట్లు కోర్టు గుర్తించింది" అని పేర్కొంది.
సమయం గడిపేలా
శిఖర్ ధావన్ చేసిన ఆరోపణలు నిజమని తేలడంతో కుటుంబ న్యాయస్థానం విడాకులు ప్రకటించింది. అయితే, తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్ చేసిన అభ్యర్థనను మాత్రం కోర్టు నిరాకరించింది. తన కుమారుడితో వీడియో కాల్ ద్వారా టచ్‍లో ఉండేలా వెసులుబాటు కల్పించింది. స్కూల్ వెకేషన్ సమయంలో ఆయేషా తన కుమారుడిని ఇండియాకు తీసుకొచ్చి ధావన్ ఫ్యామిలీతో సమయం గడిపేలా చూడాలని ఆదేశించింది. కాగా ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషాను 2012లో ధావన్ పెళ్లి చేసుకున్నాడు.