David Warner Double Century: టెస్ట్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌ డేవిడ్‌ వార్నర్‌-david warner hits double century in his 100th test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  David Warner Hits Double Century In His 100th Test

David Warner Double Century: టెస్ట్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌ డేవిడ్‌ వార్నర్‌

Hari Prasad S HT Telugu
Dec 27, 2022 11:47 AM IST

David Warner Double Century: టెస్ట్‌ క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌. సౌతాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్ట్‌లో అతడు డబుల్‌ సెంచరీ చేశాడు.

వందో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్
వందో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ (AP)

David Warner Double Century: చాలా రోజులుగా టెస్ట్‌ క్రికెట్‌లో పరుగులు సాధించడానికి తడబడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. ఒకేసారి కాస్త గట్టిగానే కొట్టాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్ట్‌ అతని కెరీర్‌లో 100వ టెస్ట్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఇలా వందో టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా వార్నర్‌ నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇంతకు ముందు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. గతేడాది ఫిబ్రవరిలో రూట్‌ తన వందో టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ కొట్టాడు. ఇక టెస్టుల్లో వార్నర్‌కు ఇది మూడో డబుల్‌ సెంచరీ. అయితే అప్పటికే కాళ్ల తిమ్మిర్లతో బాధపడుతున్న వార్నర్‌.. సరిగ్గా 200 స్కోరు చేరుకోగానే ఇక బ్యాటింగ్‌ కొనసాగించలేకపోయాడు.

ప్రేక్షకులకు డబుల్‌ సెంచరీ అభివాదం చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. వార్నర్‌ మెరుపులు తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియాను పటిష్ఠ స్థితిలో నిలిపాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 189 రన్స్‌కే ఆలౌటైన విషయం తెలిసిందే. వార్నర్‌ డబుల్‌ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

ఇక ఈ మ్యాచ్‌లో అంతకుముందు డేవిడ్‌ వార్నర్‌ మరికొన్ని ఘనతలు కూడా అందుకున్నాడు. కెరీర్‌లో మూడు ఫార్మాట్లు కలిపి వార్నర్‌కు ఇది 45వ సెంచరీ. ఈ క్రమంలో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును సమం చేశాడు. ఇక వందో టెస్ట్‌లో సెంచరీ చేసిన రెండో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలిచాడు. రికీ పాంటింగ్‌ గతంలో ఈ ఘనత సాధించాడు. అంతేకాదు టెస్టుల్లో ఇదే ఇన్నింగ్స్‌లో 8 వేల పరుగుల మైలురాయినీ దాటాడు.

WhatsApp channel

సంబంధిత కథనం