Cummins mother passed away: పాపం కమిన్స్.. తల్లి మరణంతో తీవ్ర విషాదంలో ఆస్ట్రేలియా కెప్టెన్-cummins mother passed away after prolonged illness ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cummins Mother Passed Away After Prolonged Illness

Cummins mother passed away: పాపం కమిన్స్.. తల్లి మరణంతో తీవ్ర విషాదంలో ఆస్ట్రేలియా కెప్టెన్

Hari Prasad S HT Telugu
Mar 10, 2023 09:41 AM IST

Cummins mother passed away: పాపం కమిన్స్.. తల్లి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు ఆస్ట్రేలియా కెప్టెన్. ఆమె బాగోగులు చూసుకోవడానికే అతడు ఇండియాతో టెస్ట్ సిరీస్ మధ్యలోనే వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (REUTERS)

Cummins mother passed away: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం (మార్చి 10) ఉదయం తుది శ్వాస విడిచారు. మారియా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆమెకు సంతాపంగా ఆస్ట్రేలియా టీమ్ ప్లేయర్స్ నల్ల బ్యాండ్లు ధరిస్తారని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

"మారియా కమిన్స్ మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ తరఫున ప్యాట్ కు, కమిన్స్ కుటుంబానికి, స్నేహితులకు మా సంతాపం వ్యక్తం చేస్తున్నాం" అని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. మారియా కమిన్స్ మరణానికి నివాళిగా శుక్రవారం (మార్చి 10) నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ నల్ల బ్యాండ్లు ధరిస్తారని ఆ ప్రకటనలో చెప్పింది.

రెండో టెస్ట్ ముగిసిన తర్వాత ప్యాట్ కమిన్స్ హుటాహుటిన తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే. మూడో టెస్టు ప్రారంభమయ్యేలోపు అతడు తిరిగి వస్తాడని ముందుగా భావించినా తల్లి ఆరోగ్యం మెరుగవకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత నాలుగో టెస్టుకు కూడా రావడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.

కమిన్స్ వెళ్లిపోయిన తర్వాత స్టీవ్ స్మిత్ స్టాండిన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మూడో టెస్టులో అద్భుతమైన విజయం సాధించింది. నాలుగో టెస్టును కూడా ఘనంగా ప్రారంభించింది. కమిన్స్ వన్డే టీమ్ కు కూడా కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తల్లి మరణంతో అతడు ఆ సిరీస్ కు వచ్చేది కూడా అనుమానంగా మారింది.

WhatsApp channel

సంబంధిత కథనం