సౌదీ ప్రో లీగ్ టైటిల్ రేసులో అల్-నాసర్ టీమ్ ఆశలను సజీవంగా ఉంచేలా ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో సూపర్ గోల్ కొట్టాడు. అల్-రియాద్ పై సంచలన గోల్ చేశాడు. రెండు గోల్స్ తో టీమ్ ను గెలిపించాడు. సెకండాఫ్ లో రొనాల్డో కొట్టిన వరల్డ్ క్లాస్ కిక్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. ఆ మెరుపు గోల్ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో రొనాల్డో గోల్స్ మోత కొనసాగుతూనే ఉంది. 1000 గోల్స్ రికార్డుపై కన్నేసిన ఈ ఫుట్‌బాల్ స్టార్.. ఖాతాలో ప్రస్తుతం 933 గోల్స్ ఉన్నాయి. అల్ రియాద్ పై రెండు గోల్స్ తో నంబర్ ను మరింత పెంచుకున్నాడు. అయిదు సార్లు బాలన్ డి'ఓర్ విజేతగా నిలిచిన ఈ ఆటగాడు.. గ్రౌండ్ లో అదరగొడుతూనే ఉన్నాడు.
తొలి అర్ధభాగం అదనపు సమయంలో అల్ రియాద్ ఆటగాడు ఫైజ్ సెలెమానీ రీబౌండ్ లో గోల్ సాధించాడు. సెకండాఫ్ లో రొనాల్డో తన జట్టును గెలిపించే బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు. 40 ఏళ్ల రొనాల్డో అద్భుత గోల్ చేసి అల్-నాసర్ ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఒక వాలీని టాప్ కార్నర్ కు కనెక్ట్ చేసి ప్రపంచ స్థాయి గోల్ సాధించాడు.
అల్-నాసర్ ప్రస్తుతం సౌదీ ప్రో లీగ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అల్-ఇతిహాద్, అల్-హిలాల్ టాప్-2లో ఉన్నాయి. ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న రొనాల్డో ఈ ఇప్పటివరకు 32 గోల్స్, 4 అసిస్ట్ లు సాధించాడు.
1000 ప్రొఫెషనల్ గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచే సువర్ణావకాశం ఈ 40 ఏళ్ల ఆటగాడి ముందు నిలిచింది.
సంబంధిత కథనం