Rohit manhandled Chahal: చహల్‌పై చేయి చేసుకున్న రోహిత్.. కోహ్లి రియాక్షన్ చూడండి.. వీడియో
Rohit manhandled Chahal: చహల్‌పై చేయి చేసుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ సమయంలో పక్కనే కూర్చున్న కోహ్లి రియాక్షన్ వైరల్ అవుతోంది. చహల్ తో రోహిత్ తరచూ ఇలా ఆడుకోవడం కనిపిస్తూనే ఉంటుంది.
Rohit manhandled Chahal: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డ్ లో, బయట ప్లేయర్స్ తో సరదాగా ఉంటాడు. అదే సమయంలో వాళ్లు ఏదైనా తప్పు చేస్తే ఫీల్డ్ లోనే చాలా సీరియస్ అవడం కూడా చూస్తూనే ఉంటాం. శనివారం (జులై 29) వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలోనూ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ తో రోహిత్ అలాగే చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
రెండో వన్డేలో రోహిత్, చహల్, కోహ్లి ఆడలేదు. ముగ్గురూ ఫీల్డ్ బయట కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు. ఈ సమయంలో పక్కనే ఉన్న చహల్ తో కోహ్లి ఏదో చెబుతున్నాడు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన రోహిత్.. చహల్ తలపై కొట్టాడు. తర్వాత అదే పనిగా వీపులో బాదుడే బాదాడు. అది చూసి కోహ్లి నవ్వుతూ తనకేం సంబంధం లేదన్నట్లు ఉండిపోయాడు.
కోహ్లి పక్కన ఉన్న జైదేవ్ ఉనద్కట్ కూడా నవ్వుతూ కనిపించాడు. చహల్ ను రోహిత్ ఇలా కొట్టడం ఇదే తొలిసారి కాదు. నిజానికి చహల్ తోనే కాదు జట్టులోని జూనియర్ ప్లేయర్స్ తో ఇలాగే ఆడుకుంటూ ఉంటాడు. గతంలో ఫీల్డ్ లోకి డ్రింక్స్ మోసుకొచ్చిన ఇషాన్ ను కూడా రోహిత్ సరదాగా కొట్టబోయిన వీడియో వైరల్ అయింది. దీనిపై విమర్శలు వచ్చినా రోహిత్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.
ఇక వెస్టిండీస్ తో రెండో వన్డే విషయానికి వస్తే సీనియర్ ప్లేయర్స్ ను పక్కన పెట్టి ప్రయోగాల జోలికి పోలిన టీమిండియా.. తగిన మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ లో 6 వికెట్లతో ఓడిపోయింది. వరల్డ్ కప్ కంటే ముందు వన్డే ఫార్మాట్ లో ప్రయోగాలు చేయడానికి వెస్టిండీస్ ను ఎంచుకున్న ఇండియన్ టీమ్.. ఈ మ్యాచ్ లో బోల్తా పడింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇవ్వడం ఏంటి? వరల్డ్ కప్ కు ముందు బ్యాటింగ్ ఆర్డర్ పై స్పష్టత లేకపోవడం ఏంటన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మూడో వన్డేకు రోహిత్, కోహ్లి తిరిగి వస్తారా? లేక టీమ్ ప్రయోగాలను కొనసాగిస్తుందా అన్నది కూడా వేచి చూడాలి.
సంబంధిత కథనం