RCB New Coach: ఆర్సీబీ కొత్త కోచ్‌గా ఆండీ ఫ్లవర్-cricket news rcb new coach is andy flower ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cricket News Rcb New Coach Is Andy Flower

RCB New Coach: ఆర్సీబీ కొత్త కోచ్‌గా ఆండీ ఫ్లవర్

Hari Prasad S HT Telugu
Aug 04, 2023 11:21 AM IST

RCB New Coach: ఆర్సీబీ కొత్త కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వచ్చాడు. ఇన్నాళ్లూ కోచ్ గా ఉన్న సంజయ్ బంగార్ ను ఆ ఫ్రాంఛైజీ తప్పించింది. ఈ విషయాన్ని శుక్రవారం (ఆగస్ట్ 4) ఆ టీమ్ వెల్లడించింది.

ఆర్సీబీ కొత్త కోచ్ గా వచ్చిన ఆండీ ఫ్లవర్
ఆర్సీబీ కొత్త కోచ్ గా వచ్చిన ఆండీ ఫ్లవర్ (Action Images via Reuters)

RCB New Coach: ఇప్పటి వరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంఛైజీ మరోసారి తమ హెడ్ కోచ్ ను మార్చింది. ఇన్నాళ్లూ కోచ్ గా ఉన్న టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సంజయ్ బంగార్ స్థానంలో జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు శుక్రవారం (ఆగస్ట్ 4) వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

గత రెండేళ్లుగా లక్నో సూపర్ జెయింట్స్ తో ఉన్న ఆండీ ఫ్లవర్.. ఇప్పుడిక బెంగళూరుకు షిఫ్ట్ కానున్నాడు. ఐపీఎల్లోకి ఎల్ఎస్‌జీ ఎంట్రీ ఇచ్చిన 2022 నుంచి ఆ జట్టుతోనే ఫ్లవర్ ఉన్నాడు. రెండు సీజన్ల పాటు ఆ టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రాహుల్ లతో కలిసి పని చేశాడు. అయితే జులైలో ఆండీ ఫ్లవర్ ను పక్కన పెట్టిన లక్నో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ను హెచ్ కోచ్ గా నియమించింది.

ఇటు ఆర్సీబీ సంజయ్ బంగార్, మైక్ హెసెన్ లను పక్కన పెట్టి.. ఫ్లవర్ ను తీసుకొచ్చింది. 2019 నుంచి మైక్ హెసెన్ ఆర్సీబీతోనే ఉన్నాడు. ఈ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోచింగ్ లో ఆర్సీబీ వరుసగా మూడేళ్లు ప్లేఆఫ్స్ చేరింది. ఈ ఏడాది మాత్రం కొద్దిలో ఆ అవకాశం చేజార్చుకుంది. ఆండీ ఫ్లవర్ ను కోచ్ గా నియమిస్తున్న విషయాన్ని ఆర్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

"ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్, టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ను ఆర్సీబీ మెన్స్ టీమ్ హెడ్ కోచ్ గా నియమించామని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాం" అని ఆర్సీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలతో కలిసి ఆండీ ఫ్లవర్ పని చేయనున్నాడు.

జింబాబ్వే తరఫున మోస్ట్ సక్సెస్ బ్యాటర్ గా ఆండీ ఫ్లవర్ కు పేరుంది. అతడు ఆ టీమ్ తరఫున 63 టెస్టులు, 213 వన్డేలలో ఏకంగా 10 వేలకుపైగా రన్స్ చేశాడు. ఆ తర్వాత కోచింగ్ కెరీర్లోనూ సక్సెస్ సాధించాడు. అతని కోచింగ్ లోనే 2010లో ఇంగ్లండ్ టీమ్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది.

WhatsApp channel

సంబంధిత కథనం