Trolls On Ajinkya Rahane : ఏంటి రహానే.. ఇది పద్ధతేనా? మరీ ఘోరంగా ఆడుతున్నావ్
Ajinkya Rahane : వెస్టిండీస్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాడు అజింక్య రహానే కేవలం 8 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు జోరుగా వస్తున్నాయి.

భారత్, వెస్టిండీస్(IND Vs WI) మధ్య రెండో టెస్టు జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ 87(నాటౌట్), రోహిత్ శర్మ 80, యశస్వి జైస్వాల్ 57, జడేజా 36(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 2వ రోజు మ్యాచ్‌పై భారత క్రికెట్ అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
కాగా, భారత జట్టు వైస్ కెప్టెన్ రహానే పేలవ ప్రదర్శన అభిమానుల్లో విమర్శలకు కారణమైంది. భారత జట్టులో రోహిత్ శర్మ-జైస్వాల్ భాగస్వామ్యం(Rohit Sharma Jaiswal Partnership) లంచ్ విరామం వరకు వికెట్లు లేకుండా కొనసాగింది. అయితే లంచ్ విరామం తర్వాత జైస్వాల్, శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ(Rohit Sharma)లు నిర్ణీత వ్యవధిలో అవుటయ్యారు. తద్వారా భారత జట్టును కాపాడే పని విరాట్ కోహ్లీ-రహానే చేతుల్లో పడింది.
కానీ రహానే కేవలం 8 పరుగుల వద్ద గాబ్రియెల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. స్టంప్ ఎగిరి కిందపడిపోవడంతో అభిమానుల్లో విషాదం నెలకొంది. తొలి టెస్టులో రహానే కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు. ప్రస్తుతం 8 పరుగులకే ఔట్ కావడంతో రహానేపై మళ్లీ విమర్శలు వస్తున్నాయి. ఏంటి రహానే ఇలా ఆడుతున్నావని మండిపడుతున్నారు.
18 నెలల తర్వాత పునరాగమనం చేసిన రహానే(rahane).. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. వెంటనే అతనికి వైస్ కెప్టెన్సీ అప్పగించారు. దీని తర్వాత, వెస్టిండీస్‌పై అతనికి ఇచ్చిన రెండు అవకాశాలను సరిగా వాడుకోలేదు. దీంతో రహానే స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు శుభారంభం లభించింది. తొలి మ్యాచ్ లాగే ఇక్కడ కూడా భారత ఓపెనింగ్ జోడీ గట్టి పునాది వేసింది. రోహిత్ శర్మ(Rohit Sharma) 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి జోమెల్ వారికన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 57 పరుగులు చేశాడు. శుభ్ మన్ గిల్ 10, అజింక్య రహానే 8 పరులు చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 87, జడేజా 36 పరుగులతో ఉన్నారు.