India vs Pakistan: హాస్పిటల్ బెడ్స్‌నూ వదలని ఫ్యాన్స్.. ఇండియా, పాకిస్థాన్ వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్-cricket news india vs pakistan world cup match fans booking hospital beds ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Pakistan: హాస్పిటల్ బెడ్స్‌నూ వదలని ఫ్యాన్స్.. ఇండియా, పాకిస్థాన్ వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్

India vs Pakistan: హాస్పిటల్ బెడ్స్‌నూ వదలని ఫ్యాన్స్.. ఇండియా, పాకిస్థాన్ వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్

Hari Prasad S HT Telugu
Published Jul 21, 2023 11:00 AM IST

India vs Pakistan: హాస్పిటల్ బెడ్స్‌నూ వదలడం లేదు క్రికెట్ ఫ్యాన్స్. ఇండియా, పాకిస్థాన్ వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. హోటల్ గదుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం

India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. అక్టోబర్ 15న అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ కోసం ఎన్నో నెలల ముందుగానే అహ్మదాబాద్ లో హోటల్ రూమ్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అక్కడి హోటల్ యజమాను ఏకంగా రోజుకు రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారు.

కొన్ని స్టార్ హోటల్స్ లో ఇది ఏకంగా రూ.లక్ష వరకూ ఉంది. అయినా వాటిలోనూ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. దీంతో అభిమానులు కొత్త ప్లాన్ వేశారు. నరేంద్ర మోదీ స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్ బెడ్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఒక రోజు వసతి కోసం అక్కడి హాస్పిటల్స్ ను కూడా ఫ్యాన్స్ వదలడం లేదు. ఇప్పటికే అలా తమకు ఎన్నో వినతులు వచ్చినట్లు స్టేడియం దగ్గర్లో ఉన్న హాస్పిటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి.

హెల్త్ చెకప్ కూడా..

ఈ హాస్పిటల్ బెడ్స్ కు కూడా ఆ ఒక్క రోజు వసతి కోసం రూ.3 వేల నుంచి రూ.25 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. అందులోనే ఆహారంతోపాటు పూర్తి మెడికల్ చెకప్ లాంటి వసతులు కూడా ఇస్తున్నారు. దీంతో హోటల్ గదుల్లో వేలకువేలు పోసి రూమ్ తీసుకోవడం కంటే ఇలా చేయడం బెటరని చాలా మంది భావిస్తున్నారు. పేషెంట్ తోపాటు మరొకరు కూడా ఉండే అవకాశం ఉంటుంది.

ఇలా చేయడం వల్ల తమ హెల్త్ చెకప్ పూర్తి కావడంతోపాటు ఒక రోజు వసతి కూడా కలుగుతుందన్నది చాలా మంది భావనగా కనిపిస్తోందని అక్కడి ఓ హాస్పిటల్ డైరెక్టర్ చెప్పారు. ఆ అక్టోబర్ 15 సమయంలోనే తమకు 24 గంటల నుంచి 48 గంటల వసతి కోసం ఎన్నో వినతలు వస్తున్నట్లు అక్కడి హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ నిఖిల్ లాలా చెప్పారు.

ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ లు అత్యంత అరుదుగా జరుగుతున్నాయి. అందులోనూ ఇండియా వేదికగా అసలు జరగడం లేదు. ఆసియా కప్ లో అంతకుముందే రెండుసార్లు తలపడే అవకాశం ఉన్నా.. ఆ మ్యాచ్ లు శ్రీలంకలో జరగనున్నాయి. దీంతో అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ కు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది.

Whats_app_banner

సంబంధిత కథనం