India vs West Indies: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ఇండియా తుది జట్టు ఇదే.. ఇషాన్‌కు నో ఛాన్స్!-cricket news india predicted xi vs west indies in first odi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cricket News India Predicted Xi Vs West Indies In First Odi

India vs West Indies: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ఇండియా తుది జట్టు ఇదే.. ఇషాన్‌కు నో ఛాన్స్!

Hari Prasad S HT Telugu
Jul 27, 2023 09:29 AM IST

India vs West Indies: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ఇండియా తుది జట్టుపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్ బదులు సంజూ శాంసన్ ను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (AP)

India vs West Indies: ఇండియా, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే గురువారం (జులై 27) బ్రిడ్జ్‌టౌన్ లో జరగనుంది. మూడు వన్డేల సిరీస్ ఇది. వరల్డ్ కప్ కు అసలు అర్హత సాధించని వెస్టిండీస్.. ఆ టోర్నీలో ఫేవరెట్స్ లో ఒకటిగా దిగుతున్న ఇండియా మధ్య సిరీస్ ఎలా జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

అయితే తొలి వన్డేకు టీమిండియా తుది జట్టుపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వస్తోంది. ఈ మ్యాచ్ కు వికెట్ కీపర్ గా ఇషాన్ బదులు సంజూ శాంసన్ కే అవకాశం ఇవ్వనున్నారు. కేఎల్ రాహుల్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో తుది జట్టులో వికెట్ కీపర్ స్థానం మరొకరికి దక్కనుంది. దీనికోసం ఇషాన్, సంజూ పోటీ పడుతున్నారు.

అయితే ఈ మధ్యే వెస్టిండీస్ తో టెస్ట్ అరంగేట్రం చేసిన ఇషాన్ కంటే సంజూకే తుది జట్టులో ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. ఆసియా కప్, వరల్డ్ కప్ నేపథ్యంలో వెస్టిండీస్ సిరీస్ తమను తాము నిరూపించుకోవడానికి ఈ ప్లేయర్స్ కు మంచి అవకాశం. ఇక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సిరీస్ లో ఎలా రాణిస్తాడో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

అతడు చివరిగా ఆడిన మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డకౌటైన విషయం తెలిసిందే. రోహిత్, గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. ఇషాన్ మూడో ఓపెనర్ గా బ్యాకప్ గా ఉండనున్నాడు.

ఇండియా తుది జట్టు అంచనా

ఓపెనర్లు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్

మిడిల్ ఆర్డర్: విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా

ఆల్ రౌండర్స్: రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్

బౌలర్లు: యుజువేంద్ర చహల్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్

WhatsApp channel

సంబంధిత కథనం