IND Vs WI 2nd T20 : అయ్యా.. పాండ్యా జెర బ్యాటింగ్ లైనప్ చూసుకో.. క్రీజులోకి యాక్షన్ ప్లేయర్!-cricket news hardik pandya planning for batting line up in ind vs wi 2nd t20 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Wi 2nd T20 : అయ్యా.. పాండ్యా జెర బ్యాటింగ్ లైనప్ చూసుకో.. క్రీజులోకి యాక్షన్ ప్లేయర్!

IND Vs WI 2nd T20 : అయ్యా.. పాండ్యా జెర బ్యాటింగ్ లైనప్ చూసుకో.. క్రీజులోకి యాక్షన్ ప్లేయర్!

Anand Sai HT Telugu
Aug 06, 2023 09:52 AM IST

IND Vs WI 2nd T20 : వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ ఒకటికి సున్నాతో ఆధిక్యంలో ఉంది.

హార్టిక్ పాండ్యా
హార్టిక్ పాండ్యా

వెస్టిండీస్‌తో తొలి టీ20 ఓడిపోవడంతో టీమిండియా(Team India)పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఈ స్థితిలో రెండో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో భారత జట్టు ఉంది. భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌ తప్పిదాలే తొలి టీ20లో ఓటమికి కారణమని పలువురు క్రికెట్‌ విమర్శకులు ఆరోపిస్తున్నారు. దీంతో రెండో టీ20 మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు తీసుకురావాలని భారత జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.

తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టులో టాప్ ఆర్డర్ సరిగా రాణించకపోతే.. మిడిల్ ఆర్డర్ కూడా పడిపోయింది. ఇక భారత బౌలర్ల(India Bowlers) బ్యాటింగ్ పరిస్థితి దారుణంగా ఉంది. మ్యాచ్ గెలిచినట్టే అనిపించినా.. నాలుగు పరుగులతో ఇండియా ఓడిపోయింది.

దీంతో ఓపెనర్లు సరిగా ఆడకపోతే.. బ్యాక్ ఆర్డర్ ఆటగాళ్లు పరుగులు జోడించలేకపోతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న భారత జట్టు బ్యాటింగ్‌ను పటిష్టం చేయాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే యువ యాక్షన్ ప్లేయర్ జైస్వాల్ ను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని భారత టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

జైస్వాల్(Jaiswal), గిల్(Gill) ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఉంటారు. ఎనిమిదో ఆటగాడిగా అక్షర్ పటేల్ ఆడే అవకాశం ఉంది. బౌలింగ్ విషయంలోనూ భారత్ ప్రణాళికలు చేస్తోంది. చాహల్ లేదా కుల్దీప్‌ను చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ జట్టులో అర్షిదీప్ సింగ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. మరొకరికి కూడా అవకాశం ఇస్తారు. తొలి టీ20 మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్ బౌలర్లు ఉన్నప్పటికీ అక్షర్ పటేల్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈసారి బౌలింగ్, బ్యాటింగ్‌కు బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది టీమిండియా.

ఇక భారత బౌలర్ల మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం కూడా ఉంది. టీమిండియాను వేధించే సమస్య ఒకటి ఉంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, ఆల్ రౌండర్లలో చాలా మంది ప్రతిభ కలిగిన ఉన్నారు. అయితే బౌలర్ల విషయానికి వస్తే మాత్రం భారత్‌కు సమస్య తప్పడం లేదు. ప్రపంచంలోని ఇతర క్రికెట్ ఆడే జట్లతో పోలిస్తే, టీమ్ ఇండియాలో నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. ఈ బౌలర్లు కేవలం బౌలింగ్‌కే పరిమితం కావడంతో టీమిండియాకు ఎదురుదెబ్బ తగులుతుంది. టీమిండియా బౌలింగ్ విభాగం కీలక సమయాల్లో చాలాసార్లు చేతులెత్తేసింది. ఈ కారణంగా జట్టు చాలాసార్లు ఓటమి భారమైంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఎప్పుడూ సక్సెస్ అవ్వాలని లేదు.. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు రావొచ్చు. అలాంటి సమయంలో చివర్లో బ్యాట్ పట్టుకుని వచ్చే చాలా మంది బౌలర్లు తమ స్థాయికి తగ్గ ఆట ఆడటంలో విఫలమవుతున్నారు.