Ashwin on Bazball: ఇండియా బజ్‌బాల్ ఆడితే టీమ్‌లో ఎవరూ మిగలరు: అశ్విన్
Ashwin on Bazball: ఇండియా బజ్‌బాల్ ఆడితే టీమ్‌లో ఎవరూ మిగలరు అంటూ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లండ్ ఆడుతున్న బజ్‌బాల్ స్టైల్ ను ఇండియా కూడా ఫాలో అవుతుందా అన్న ప్రశ్నపై అశ్విన్ స్పందించాడు.
Ashwin on Bazball: టెస్ట్ క్రికెట్ ఆడే విధానాన్ని మార్చేస్తోంది ఇంగ్లండ్. దీనికి బజ్‌బాల్ అనే కొత్త పేరు కూడా పెట్టారు. ఈ స్టైల్ తో వరుసగా ఆ టీమ్ సిరీస్ లు గెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ ను గెలవకపోయినా.. కనీసం డ్రా చేసుకోగలిగింది. అయితే ఈ స్టైల్ ను ఇండియన్ టీమ్ కూడా ఫాలో అవుతుందా అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు
"మేము టెస్ట్ క్రికెట్ బాగా ఆడుతున్నాం. కానీ త్వరలోనే పరివర్తన దిశగా వెళ్తున్నాం. ఆ దశలో పరిస్థితులు అంత సులువుగా ఉండవు. కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ ఈ దశలో ఇండియా బజ్‌బాల్ స్టైల్ అడాప్ట్ చేసుకుందని అనుకుందాం. హ్యారీ బ్రూక్ లాగా మన ప్లేయర్స్ కూడా బ్యాట్ ఝుళిపించడానికి ప్రయత్నించారని అనుకుందాం.
రెండు మ్యాచ్ లు ఓడిపోతాం. మనం ఏం చేస్తాం? బజ్‌బాల్ కు, ప్లేయర్స్ కు మద్దతిస్తామా? కనీసం నలుగురు ప్లేయర్స్ పై వేటు వేస్తాం. మన సంస్కృతి ఎప్పుడూ ఇలాగే ఉంది. ఇతరుల స్టైల్ వాళ్లకు మంచి ఫలితాలు ఇచ్చింది కదా అని మనం కాపీ చేయలేం. వాళ్లకు అది పని చేసింది ఎందుకంటే వాళ్ల మేనేజ్‌మెంట్, సెలక్టర్లు ఈ స్టైల్ ను ఆమోదించారు. మద్దతిచ్చారు. వాళ్ల అభిమానులు కూడా ఆమోదించారు. మనం అది చేయలేం" అని అశ్విన్ స్పష్టం చేశాడు.
ఇక వన్డే వరల్డ్ కప్ పై కూడా అశ్విన్ స్పందించాడు. అభిమానులు ఇండియన్ టీమ్ కు సానుకూలంగా మద్దతివ్వాలని కోరాడు. "వరల్డ్ కప్ గెలవడం అంత సులువు కాదు. ఓ ప్లేయర్ ను ఆడించడం వల్లో, తీసేయడం వల్లో వరల్డ్ కప్ గెలవలేం. మనమందరం గతాన్ని చూసే కింగులం. ఆ గతాలు ఇక్కడ పనికిరావు. దాదాపు ప్రతి మేజర్ టోర్నమెంట్లో మనం సెమీఫైనల్ చేరాం. ఆ రోజు సరిగా ఆడలేకపోయాం అంతే" అని అశ్విన్ అన్నాడు.
సంబంధిత కథనం