Cricket Fans On BCCI : ఇక మీ ప్రయోగాలు ఆపుతారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్-cricket lovers fires on bcci and demands rohit and virat kohli bring back to t20 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cricket Lovers Fires On Bcci And Demands Rohit And Virat Kohli Bring Back To T20

Cricket Fans On BCCI : ఇక మీ ప్రయోగాలు ఆపుతారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

Anand Sai HT Telugu
Jan 28, 2023 02:00 PM IST

IND Vs NZ T20 : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇండియన్ టీమ్ లో లేకుంటే.. కొంతమంది ఆట కూడా చూడరేమో. వాళ్లకు అంతటి ఫ్యాన్స్ ఉన్నారు. భారత జట్టుకు దశాబ్దకాలంగా వెన్నెముకగా ఉన్నారు. అయితే టీ20లో ఆడించకపోవడంపై బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (twitter)

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ భారత్.. క్లీన్ స్వీప్ చేసింది. ఇవే ఆశలు.. టీ20 సిరీస్ పై పెట్టుకున్నారు క్రికెట్ లవర్స్. కానీ మెుదటి మ్యాచ్ లోనే వైఫల్యంతోనే గరం అయ్యారు. రాంచీ వేదికగా జరిగిన మెుదటి టీ20లో భారత జట్టు ఓటమి నిరాశపరిచింది. ప్రత్యర్థులకు అవకాశాలు ఇస్తూ.. వాళ్ల బౌలింగ్ తో ఇబ్బంది పడటంపై అభిమానులు మండిపడుతున్నారు. అనుభవలేమి కారణంతోనే.. ఇలా జరిగిందని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

కిందటి ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత.. సీనియర్లను పక్కనబెట్టడంపై బీసీసీఐ(BCCI)పై క్రికెట్ లవర్స్ మండిపడుతున్నారు. వచ్చే టీ20 ప్రపంచ కప్(T20 World Cup) కోసం యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేయిస్తోంది. అయితే దశాబ్దకాలంగా టీమిండియాకు వెన్నెముకగా ఉన్న రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)లను పక్కనపెట్టడంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అయితే యువకులకు అవకాశం ఇవ్వడాన్ని మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు.

శుక్రవారంలో రాంచీలో తొలి టీ20లో ఇండియా పూర్తిగా విఫలమైంది. పేసర్లు పరుగులిచ్చేశారు. అర్ష్‌దీప్ సింగ్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, హార్ధిక్ పాండ్యాలు విఫలమయ్యారు. బ్యాటర్లలో ఇషాన్ కిషన్, గిల్, రాహుల్ త్రిపాఠి, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా వచ్చి వెళ్లారంతే. ఒక్క వాషింగ్టన్ సుందర్ మాత్రం.. పర్వాలేదనిపించాడు. అయితే ఈ ఓటమికి అనుభవలేమీ కారణమని.. ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

రోహిత్, కోహ్లీలను పక్కనపెట్టి.. టీమిండియా(Team India) మూల్యం చెల్లించుకుంటుందని అంటున్నారు. బీసీసీఐ ప్రయోగాలు పక్కనబెట్టి.. వీరిని టీ20లు ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

'టీ20లలో మన ఓపెనర్లను చూశాక రోహిత్, కోహ్లీలు టీమ్ లోకి రావడమే మంచిదని అనిపిస్తోంది. ఈ ఇద్దరూ 2024 టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాలి. రోహిత్, కోహ్లీ లేని టీమిండియాను ఊహించుకోలేకపోతున్నాం. ఈ మ్యాచ్ ద్వారా బీసీసీఐకి అర్థమై ఉండాలి. ఇగోలను పక్కనబెట్టి ఆ ఇద్దరినీ ఆడించండి.' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

న్యూజిలాండ్ తో మెుదటి టీ20లో భారత్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. డెవాన్ కాన్వే (52), డెరల్ మిచెల్ (59) అర్ధ సెంచరీలతో న్యూజిలాండ్ 176 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 35, గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులు చేశారు. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ తలో వికెట్ తీశారు.

177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మెుదట్లోనే వికెట్లు కోల్పోవడం ప్రారంభించింది. గిల్ 7 పరుగులు, ఇషాన్ కిషన్ 4, రాహుల్ త్రిపాఠి ఔటవడంతో భారత జట్టు 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (21), సూర్యకుమార్‌ యాదవ్‌ (47) భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ విజయానికి చేరువ కాలేదు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 28 బంతుల్లో 50 పరుగులు చేసినా.. ఇతర బ్యాటర్లు అతడికి సపోర్ట్ ఇవ్వలేకపోయారు. చివరికి భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేయగలిగింది.

WhatsApp channel

సంబంధిత కథనం