Pujara Century in County Cricket: కౌంటీల్లో పుజారా సెంచ‌రీ - తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అద‌ర‌గొట్టాడు-cheteshwar pujara hits century in county cricket first match against durham ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cheteshwar Pujara Hits Century In County Cricket First Match Against Durham

Pujara Century in County Cricket: కౌంటీల్లో పుజారా సెంచ‌రీ - తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అద‌ర‌గొట్టాడు

Nelki Naresh Kumar HT Telugu
Apr 08, 2023 11:19 AM IST

Pujara Century in County Cricket: కౌంటీ క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లోనే పుజారా సెంచ‌రీతో మెరిశాడు. డ‌ర్హ‌మ్‌పై సెంచ‌రీతో అద‌రొట్టిన పుజారా కెప్టెన్ రోల్ కు న్యాయం చేశాడు.

పుజారా
పుజారా

Pujara Century in County Cricket: కౌంటీల్లో గ‌త ఏడాది ప‌రుగుల వ‌ర‌ద పారించిన పుజారా ఈ సీజ‌న్‌ను సెంచ‌రీతో మొద‌లుపెట్టాడు. ప్ర‌స్తుతం కౌంటీ క్రికెట్‌లో స‌సెక్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న పుజారా సెంచ‌రీతో త‌న టీమ్‌ను గ‌ట్టెక్కించాడు. డ‌ర్హ‌మ్ టీమ్‌తో జ‌రుగుతోన్న ఈ మ్యాచ్‌లో 163 బాల్స్‌లో 13 ఫోర్లు ఒక సిక్స‌ర్‌తో 115 ర‌న్స్ చేసి ఆక‌ట్టుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

90 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో బ్యాటింగ్ దిగిన పుజారా ఒంట‌రి పోరాటంతో స‌సెక్స్ టీమ్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు అందించాడు. బ్రైడ‌న్ క్రాస్ వేసిన 55వ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా నాలుగు ఫోర్లు కొట్టి అద‌ర‌గొట్టాడు. పుజారా జోరు చూస్తే డ‌బుల్ సెంచ‌రీ చేసేలా క‌నిపించాడు.

దూకుడుగా అడుతోన్న అత‌డిని బెన్ రైన్ బోల్తా కొట్టించాడు. గ‌త సీజ‌న్‌లో ఆరు సెంచ‌రీల‌తో 1094 ప‌రుగులు చేసిన పుజారా ఈ సీజ‌న్‌లో ఫ‌స్ట్ మ్యాచ్‌లోనే సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. మ‌రోవైపు ఈ ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియాతో వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌లో ఇండియా త‌ల‌ప‌డ‌నున్న సంగ‌తి తెలిసిందే.

కౌంటీ సెంచ‌రీతో టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌లో తాను ఎంత విలువైన ఆట‌గాడో ఆస్ట్రేలియాకు చాటిచెప్పాడు పుజారా. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డ‌ర్హ‌మ్ 376 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ల‌క్ష్య‌చేధ‌నలో స‌సెక్స్ టీమ్ రెండో రోజు ముగిసే స‌రికి తొమ్మిది వికెట్లు న‌ష్ట‌పోయి 332 ప‌రుగులు చేసింది.

WhatsApp channel

టాపిక్