Bumrah ruled out of T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా ఔట్.. బీసీసీఐ అధికారిక ప్రకటన-bumrah ruled out of r20 world cup says official statement from bcci ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Bumrah Ruled Out Of R20 World Cup Says Official Statement From Bcci

Bumrah ruled out of T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా ఔట్.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Hari Prasad S HT Telugu
Oct 03, 2022 08:49 PM IST

Bumrah ruled out of T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని సోమవారం (అక్టోబర్‌ 3) బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా ఆడబోవడం లేదని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా ఆడబోవడం లేదని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ (Reuters)

Bumrah ruled out of T20 World Cup: ఊహించిందే జరిగింది. స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా అతడు వరల్డ్‌కప్‌ ఆడబోవడం లేదని కొన్ని రోజుల కిందటే వార్తలు రాగా.. ఇప్పుడు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సోమవారం (అక్టోబర్‌ 3) సాయంత్రం బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

"బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడించకూడదని చెప్పింది. అతని పరిస్థితిని పూర్తిగా పరిశీలించి, స్పెషలిస్ట్‌లను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం" అని బీసీసీఐ ఆ ప్రకటనలో తెలిపింది. వెన్ను గాయం కారణంగా సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడని బుమ్రా.. తర్వాత మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు.

అప్పుడే అతడు వరల్డ్‌కప్‌ కూడా ఆడబోడని ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి వెల్లడించారు. అయితే బోర్డు నుంచి అప్పుడు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు అతని పరిస్థితిని పూర్తి అంచనా వేసిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించింది. వరల్డ్‌కప్‌ సమయానికి అతడు కోలుకుంటాడన్న ఆశతో బోర్డు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది.

అయితే ఈ టోర్నీలో బుమ్రా స్థానంలో ఎవరు అన్నదానిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే బుమ్రా స్థానంలో ఎవరు అన్నది వెల్లడిస్తామని ఆ ప్రకటనలో బోర్డు తెలిపింది. ఇప్పటికే వరల్డ్‌ టీమ్‌ స్టాండ్‌బైలలో సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమి, దీపక్‌ చహర్‌ ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు 15 మంది సభ్యుల టీమ్‌లోకి రావడం ఖాయం. అయితే ఈ ఇద్దరిలో షమికే ఎక్కువ అవకాశం ఉంది.

వరల్డ్ కప్ కోసం టీమిండియా అక్టోబర్ 6 న ముంబై నుంచి ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఆలోపు మంగళవారం (అక్టోబర్ 4) సౌతాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్ ఆడుతుంది. అయితే ఈ మ్యాచ్ కు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లకు విశ్రాంతినిచ్చారు. కోహ్లి ఇప్పటికే ఇంటికి వెళ్లిపోయాడు. అతడు అక్టోబర్ 6న టీమ్ తో కలుస్తాడు.

WhatsApp channel