IND vs WI Tour Brian Lara: ఇండియాతో సిరీస్‌కు వెస్టిండీస్ టీమ్ మెంట‌ర్‌గా బ్రియాన్ లారా-brian lara to appoint as west indies team mentor against india series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Wi Tour Brian Lara: ఇండియాతో సిరీస్‌కు వెస్టిండీస్ టీమ్ మెంట‌ర్‌గా బ్రియాన్ లారా

IND vs WI Tour Brian Lara: ఇండియాతో సిరీస్‌కు వెస్టిండీస్ టీమ్ మెంట‌ర్‌గా బ్రియాన్ లారా

HT Telugu Desk HT Telugu
Jul 04, 2023 09:53 AM IST

IND vs WI Tour Brian Lara: ఇండియా, వెస్టిండీస్ సిరీస్ జూలై 12 నుంచి మొద‌లుకానుంది. కాగా ఈ సిరీస్‌కు వెస్టిండీస్ జ‌ట్టు మెంట‌ర్‌గా లారా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

బ్రియాన్ లారా
బ్రియాన్ లారా

IND vs WI Tour Brian Lara: ఈ ఏడాది జ‌రుగ‌నున్న‌ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు క్వాలిఫై కాక‌పోవ‌డంతో వెస్టిండీస్ జ‌ట్టుపై విమ‌ర్శ‌లు వెలువెత్తుతోన్నాయి. స్కాట్‌లాండ్, నెద‌ర్లాండ్స్‌, జింబాబ్వే వంటి చిన్న జ‌ట్ల చేతిలో కూడా విండీస్ ఓట‌మి పాల‌వ్వ‌డం ఆ జ‌ట్టు బోర్డుకు మింగుడుప‌డ‌టం లేదు. ఈ ఓట‌మికి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషించే ప‌నిలో ప‌డింది.

అందులో భాగంగా త్వ‌ర‌లోనే ఇండియాతో జ‌రుగ‌నున్న సిరీస్ కోసం దిగ్గజ ఆట‌గాడు బ్రియాన్ లారా రంగంలోకి దించిన‌ట్లు స‌మాచారం. ఈ సిరీస్‌కు వెస్టిండీస్‌ టీమ్ మెంట‌ర్‌గా బ్రియ‌న్ లారా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ టూర్ మొత్తానికి విండీస్ టీమ్‌కు లారా స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే విండీస్ టూర్ ప్రాక్టీస్ సెష‌న్స్‌కు లారా హాజ‌ర‌వుతోన్న‌ట్లు స‌మాచారం. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్‌కు సంబంధించిన మెళ‌కువ‌ల‌ను ఆట‌గాళ్ల‌కు లారా ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. ముఖ్యంగా టెస్టులు, వ‌న్డేల‌కు త‌గిన‌ట్లుగా ఎక్కువ స‌మ‌యం పాటు క్రీజులో నిల‌దొక్కుకునేలా అవ‌స‌ర‌మైన టెక్నిక్స్‌పై బ్రియాన్ లారా దృష్టిసారిస్తోన్న‌ట్లు స‌మాచారం.

ఇండియా వెస్టిండీస్ సిరీస్ జూలై 12 నుంచి మొద‌లుకానుంది. ఇండియాతో రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచుల‌ను వెస్టిండీస్ ఆడ‌నుంది. ఇప్ప‌టికే ఈ సిరీస్ కోసం వెస్టిండీస్‌లో అడుగుపెట్టింది టీమ్ ఇండియా.

WhatsApp channel