Bhuvneshwar Off to Social Media: సోషల్ మీడియాకు దూరంగా భువి.. కారణం అదేనా?
Bhuvneshwar Off to Social Media: టీ20 ప్రపంచకప్ సమయంలో తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. బయట జరుగుతుందో తాను తెలుసుకోవాలనుకోట్లేదని అన్నాడు.
Bhuvneshwar Off to Social Media: టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌పై ఇటీవల కాలంలో ఘోరంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆసియా కప్‌లో డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించడంతో అతడిపై విమర్శలు విపరీతంగా వచ్చాయి. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో భారత పేస్ దళాన్ని ముందుగు నడిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్న అతడు గురువారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఈ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 7 ఓవర్లలో 31 డాట్ బాల్స్ వేశాడు. తాజాగా భువి తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు. టీ20 ప్రపంచకప్ సమయంలో తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని తెలిపాడు.
"టీ20 వరల్డ్ కప్ సమయంలో నాకు నేనుగా పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నా. ఎవరు దేని గురించి రాస్తారో నాకు తెలియదు. ఎందుకంటే ఈ విషయాలన్నీ మీకు సోషల్ మీడియా నుంచే తెలుస్తాయి. సోషల్ మీడియా పరంగా ఇన్నేళ్లుగా ఈ టోర్నమెంట్‌కు మాత్రమే దూరంగా ఉన్నాను. మీడియా, కామెంటేటర్లు, చాలా విషయాలు చెబుతారు. కానీ ఓ జట్టుగా ఒడుదొడుకులు ఎలా ఉంటాయో మాకు తెలుసు. ట్రాక్ కష్టంగా ఉంటే టీ20 అనేది బౌలర్లు, బ్యాటర్లకు కఠినంగా ఉండే ఫార్మాట్. కాబట్టి ఆసియా కప్ లాంటి పెద్ద ఈవెంట్‌లోనూ ఎక్కువగా అంచనాలు పెభువనేశ్వర్ కుమార్, సోషల్ మీడియాకు భువి దూరం, సోషల్ మీడియాకు భువనేశ్వర్ దూరం, అర్ష్‌దీప్ సింగ్‌పై భువి ప్రశంసల వర్షం, తన పర్ఫార్మెన్స్‌పై భువి స్పందనట్టుకుంటారు." అని భువనేశ్వర్ కుమార్ అన్నాడు.
తన సహచర బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై భువి ప్రశంసల వర్షం కురిపించాడు. "బుమ్రా లాంటి బౌలర్ లేకపోవడం జట్టుకు చాలా కష్టం. అతడు లేడు కాబట్టి మరింత అదనంగా ఏదైనా చేస్తామనికాదు. బుమ్రా ఉండి ఉంటే అవసరమైతే అదనంగా కృషి చేసేవాళ్లం కచ్చింగా మాకు మా బలాలు ఏంటో తెలుసు. అర్ష్‌దీప్ సింగ్ అరంగేట్రం చేసినప్పటి నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఎప్పుడూ సరైనా ట్రాక్‌లోనే ఉంటాడు. బ్యాటర్లు ఎప్పుడు, ఏ షాట్లు ఆడతారో నన్ను, రోహిత్‌ను అడుగుతూనే ఉంటాడు. అతడు తన తొలి టీ20 ప్రపంచకప్‌లోనే అద్భుతంగా ఆడుతున్నాడు." అని భువి స్పష్టం చేశాడు.
టీమిండియా ఈ ప్రపంచకప్‌లో అదరగొడుతోంది. తన తొలి మ్యాచ్ పాకిస్థాన్‌పై విజయం సాధించగా.. గురువారం నాడు నెదర్లాండ్స్ లాంటి పసికూన జట్టుపై రాణించి మరో అడుగు ముందుకు వేసింది. తన తదుపరి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది టీమిండియా.
సంబంధిత కథనం