Bhuvneshwar kumar: టీ20ల్లో భువ‌నేశ్వ‌ర్ అరుదైన రికార్డు - ఈ ఘ‌న‌త‌ను సాధించిన ఫ‌స్ట్ ఇండియ‌న్ క్రికెట‌ర్ అత‌డే-bhuvneshwar kumar creates new record in t20i cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Bhuvneshwar Kumar Creates New Record In T20i Cricket

Bhuvneshwar kumar: టీ20ల్లో భువ‌నేశ్వ‌ర్ అరుదైన రికార్డు - ఈ ఘ‌న‌త‌ను సాధించిన ఫ‌స్ట్ ఇండియ‌న్ క్రికెట‌ర్ అత‌డే

HT Telugu Desk HT Telugu
Sep 10, 2022 08:18 PM IST

Bhuvneshwar kumar: టీ20ల్లో భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. విదేశీ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

భువనేశ్వర్ కుమార్
భువనేశ్వర్ కుమార్ (Twitter)

Bhuvneshwar kumar: ఆసియా క‌ప్‌లో టీమ్ ఇండియా సూప‌ర్ ఫోర్‌లోనే వెనుదిరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌లో బౌలింగ్‌లో భువ‌నేశ్వ‌ర్‌, బ్యాటింగ్‌లో కోహ్లి మాత్ర‌మే రాణించారు. ముఖ్యంగా ఆప్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పేసర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ నాలుగు ఓవ‌ర్లు వేసి నాలుగు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. టీ20ల్లో అత‌డికి ఇదే బెస్ట్ బౌలింగ్ కావ‌డం గ‌మ‌నార్హం.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్ ద్వారా భువ‌నేశ్వ‌ర్ అరుదైన రికార్డును నెల‌కొల్పాడు. విదేశీ గ‌డ్డ‌పై టీ20 యాభై వికెట్లు తీసిన తొలి భార‌తీయ బౌల‌ర్‌గా రికార్డు సృష్టించాడు. యాభై ఒక్క వికెట్లతో భువనేశ్వర్ టాప్ ప్లేస్ లో నిలవగా 44 వికెట్లతో అశ్విన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. బుమ్రా 42 వికెట్లు, చాహల్ 40 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మొత్తంగా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు.

77 మ్యాచ్ లలో 84 వికెట్లు తీశాడు. అతడి తర్వాత 83 వికెట్లతో చాహల్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. 69 వికెట్లతో బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు. ఆసియా కప్ కు గాయం కారణంగా బుమ్రా దూరమవ్వడంతో పేస్ దళాన్ని నడిపించే బాధ్యత తీసుకున్న భువనేశ్వర్ చక్కటి ఆటతీరుతో రాణించాడు. కానీ అతడికి మిగిలిన బౌలర్ల నుంచి సరైన సహకారం దొరకలేదు.

WhatsApp channel