BCCI Selectors Recruitment: జాతీయ సెలక్టర్ల కోసం చూస్తోన్న బీసీసీఐ.. దరఖాస్తులను ఆహ్వానించిన బోర్డు-bcci invited applications for national selectors for the senior men team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bcci Selectors Recruitment: జాతీయ సెలక్టర్ల కోసం చూస్తోన్న బీసీసీఐ.. దరఖాస్తులను ఆహ్వానించిన బోర్డు

BCCI Selectors Recruitment: జాతీయ సెలక్టర్ల కోసం చూస్తోన్న బీసీసీఐ.. దరఖాస్తులను ఆహ్వానించిన బోర్డు

BCCI Selectors Recruitment: బీసీసీఐ సీనియర్ పురుషుల జట్టు కోసం సీనియర్ సెలక్టర్ల రిక్రూట్మెంట్‌ను చేపట్టింది. శుక్రవారం జాతీయ సెలక్టర్ల నియామకం గురించి ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా అభ్యర్థుల అర్హత వివరాలను కూడా అందులో పేర్కొంది.

బీసీసీఐ (Twitter/BCCI)

BCCI Selectors Recruitment: భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) పురుషుల జాతీయ జట్టు కోసం సెలక్టర్ల నియమించనుంది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానించింది. సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు కోసం జాతీయ సెలక్టర్లను తీసుకోనున్నట్లు శుక్రవారం నాడు ప్రకటించింది. అంతేకాకుండా దరఖాస్తుకు చివరి తేదీని కూడా తెలియజేసింది. నవంబరు 28 సాయంత్రం 6 గంటల లోపు అర్హత కలిగిన వారు తమ అప్లికేషన్లను సబ్మిట్ చేయాల్సింది స్పష్టం చేసింది. ప్రస్తుతం జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా భారత మాజీ క్రికెటర్ చేతన్ శర్మ ఉన్నారు.

"నేషనల్ సెలక్టర్ల స్థానానికి అభ్యర్థులు తమ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడానికి ఈ క్రింది ప్రమాణాలను అనుసరించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థులు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని కనీసం 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి." అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.

టీ20 వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్‌లో టీమిండియా పరాజయం తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం. అంతేకాకుండా ఫిబ్రవరి 2022 నుంచి వెస్ట్ జోన్ సెలక్టర్ పదవీ ఖాళీగా ఉంది. చివరిగా అబే కురువిళ్ల ఆ స్థానంలో బాధ్యతలు నిర్వర్తించారు. ఈస్ట్ జోన్ సెలక్టర్ డెబాషిష్ మొహంటీ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆయన ఇంతకుముందు జూనియర్ టీమ్‌కు సెలక్షన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈస్ట్ జోన్‌లో పెద్దగా అర్హత కలిగిన టెస్టు క్రికెటర్లు లేకపోవడంతో ఆ పదవీలో వేరొకరిని ఉంచడానికి సాధ్యం పడలేదు. ప్రస్తుతానికి ఈస్ట్ జోన్ సెలక్టర్‌గా తీసుకునేందుకు ఒడిషాకు చెందిన మాజీ ఓపెనర్ శివ్ సుందర్ దాస్, బెంగాల్‌కు చెందిన దీప్ దాస్ గుప్తా ఇద్దరి పేర్లు పరిగణనలో ఉన్నాయి.

జూనియర్ నేషనల్ సెలక్టర్ పదవీకి రణదెప్ బోస్ పేరు వినిపిస్తోంది. అయితే అతడు అధికారికంగా భారత్ తరుఫున ఆడలేదు. ఆయన కాకుండా మాజీ వన్డే ఆటగాళ్లు లక్ష్మీ రతన్ శుక్లా, సంజయ్ రౌల్‌కు కూడా అర్హత ఉంది. వీరు కాకుండా టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ కోచ్ సుబ్రతో బెనర్జీకి అర్హత ఉంది.

అదే విధంగా కురువిల్లా బీసీసీఐ కార్యచరణలోకి మారిన తర్వాత నాలుగేళ్లుగా వెస్ట్ జోన్ సెలక్షన్ సీటు ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. క్రితం సారి దరఖాస్తుదారులందరిలో అత్యుత్తమ సీవీగా అజిత్ అగార్కర్‌ది ఉంది. అయితే ఆతడి సొంత రాష్ట్ర యూనిట్ అయిన ముంబై క్రికెట్ అసొసియోషన్‌ నుంచి అభ్యంతరాలు అడ్డంకిగా మారాయి.

సంబంధిత కథనం

టాపిక్