INDW vs ENGW: ఇంగ్లాండ్ పర్యటనకు భారత మహిళల జట్టు ప్రకటన.. ఝులన్ పునరాగమనం-bcci announced india women s squads for england tour ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Bcci Announced India Women's Squads For England Tour

INDW vs ENGW: ఇంగ్లాండ్ పర్యటనకు భారత మహిళల జట్టు ప్రకటన.. ఝులన్ పునరాగమనం

Maragani Govardhan HT Telugu
Aug 19, 2022 09:31 PM IST

వచ్చే నెల నుంచి భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఇంగ్లీష్ జట్టుతో భారత అమ్మాయిలు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌కు ఝులన్ గోస్వామి, జెమియా రోడ్రిగ్స్ పునరాగమనం చేయనున్నారు.

ఇంగ్లాండ్ పర్యటనకు భారత మహిళల జట్టు ప్రకటన
ఇంగ్లాండ్ పర్యటనకు భారత మహిళల జట్టు ప్రకటన (HT)

భారత మహిళల జట్టు ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ టీ20 టోర్నీలో సత్తా చాటి రజతం గెలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లో ఆస్ట్రేలియాలో చేతిలో పోరాడి ఓడిన వుమెన్స్ టీమ్ వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఆ జట్టుతో భారత అమ్మాయిలు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి వన్డే, టీ20 జట్లను ప్రకటించింది బీసీసీఐ. రెండు జట్లకు హర్మన్ ప్రీత్ కౌరే కెప్టెన్‌గా వ్యవహరించనుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనుంది. సెప్టెంబరు 10 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. మొదట టీ20లు, ఆ తర్వాత వన్డే సిరీస్ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు

భారత సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామి ఈ సిరీస్‌తో వన్డేల్లో పునరాగమనం చేయనుంది. ఫస్ట్ క్లాస్‌లో సత్తా చాటుతునున్న కిరణ్ నావిగిరే భారత టీ20 జట్టులో అవకాశం దక్కించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో కిరణ్ మహిళల టీ20 ఛాలెంజ్‌లో వెల్కోయిటీ-ట్రైల్ బ్లేజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకుంది. 34 బంతుల్లో 69 పరుగులు చేసింది. ఇందులో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

ఈ పర్యటనకు కామన్వెల్త్ గేమ్స్‌లో చోటు కోల్పోయిన రిచా ఘోష్ కూడా టీ20 జట్టులోకి తిరిగి వచ్చింది. యస్తికా భాటియా వన్డేల్లో అవకాశం దక్కించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచకప్‌ను తొలగించిన జెమిమా రోడ్రిగ్స్ కూడా ఈ సిరీస్‌తో వన్డేల్లో పునరాగమనం చేయనుంది. రోడ్రిగ్స్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. సిమ్రాన్ దిల్ బహదుర్ టీ20, వన్డేలు రెండు జట్లలోనూ స్థానాన్ని దక్కించుకుంది.

భారత మహిళల టీ20 జట్టు..

హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, జెమిమా రోడ్రిగ్స్, స్నేహ్ రానా, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, రాధా యాదవ్, సబ్బినేని మేఘన, తానియా సప్నా భాటియా, రాజేశ్వరీ గైక్వాడ్, దయాలన్ హేమలత, సిమ్రన్ దిల్ బహదుర్, రిచా ఘోష్, కిరణ్ నవ్‌గిరే.

భారత మహిళల వన్డే జట్టు..

హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, తానియా సప్నా భాటియా(వికెట్ కీపర్), యస్తికా భాటియా, పూజా వస్త్రాకర్, స్నేహ్ రానా, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్, హర్లీన్ డియోల్, దయాలన్ హేమలత, సిమ్రన్ దిల్ బహదుర్, ఝులన్ గోస్వామి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్