Virat Kohli Performance in T20 WC 2022: కోహ్లీపై ఆస్ట్రేలియా దిగ్గజాల ప్రశంసలు.. పాక్‌పై ప్రదర్శనకు ఫిదా -australia former players parsees virat kohli and recall ho he hit that sixers in rauf bowling ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Australia Former Players Parsees Virat Kohli And Recall Ho He Hit That Sixers In Rauf Bowling

Virat Kohli Performance in T20 WC 2022: కోహ్లీపై ఆస్ట్రేలియా దిగ్గజాల ప్రశంసలు.. పాక్‌పై ప్రదర్శనకు ఫిదా

Maragani Govardhan HT Telugu
Nov 04, 2022 06:22 PM IST

Virat Kohli Performance in T20 WC 2022: ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు మార్క్ టేలర్, ఇయాన్ చాపెల్.. విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో కోహ్లీ ఆట తీరు అద్భుతమని, ముఖ్యంగా హ్యారిస్ రౌఫ్ బౌలింగ్‌లో అతడు కొట్టిన రెండు సిక్సర్లు ఎలా ఆడాడో అర్థం కాలేదని తెలిపారు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (PTI)

Virat Kohli Performance in T20 WC 2022: ఆస్ట్రేలియా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్ చేరేందుకు అడుగు దూరంలో ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అదిరిపోయేలా ఆడుతున్నాడు. ఇప్పటికే మూడు అర్ధశతకాలతో దుమ్మరేపాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 82 పరుగులతో అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో అతడి ప్రదర్శనపై పలువురు మాజీలు సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే మ్యాచ్ జరిగి ఇన్ని రోజులవుతున్నా.. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు మార్క్ టేలర్, ఇయాన్ చాపెల్ ఇప్పటికీ అతడి ఆటను కొనియాడుతూనే ఉన్నారు. కోహ్లీ స్థిరత్వం, షాట్ల ఎంపికకు ఫిదా అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

"మేము రెండేళ్ల క్రితం విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేశాం. ఆట గురించి అతడు అద్భుతమైన ఉదాహరణగా చెప్పవచ్చు. కోహ్లీతో మాట్లాడేటప్పుడు ఫ్యాన్సీ షాట్లు ఎందుకు ఆడవని అడిగాం. ఇందుకు విరాట్.. నా టెస్టు గేమ్‌లో అనవసర షాట్లు ఉండకూడదని అనుకుంటాను అని బదులిచ్చాడు. కోహ్లీకున్న అద్భుత లక్షణాల్లో ఇది ఒకటి. అతడు సాధారణ షాట్లను అసాధారణంగా ఆడతాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో అతడు కొట్టిన రెండు సిక్సర్లు అద్భుతమనే చెప్పాలి. అందులోనూ బ్యాక్ ఫూట్ వేసి కొట్టిన సిక్సర్ 90 మీటర్లు వెళ్లింది. అసలు ఆ షాట్ అతడు ఎలా అంత దూరం వెళ్లిందని ఇప్పటికీ అర్థం కాదు. అదే నేను ఆ షాట్ ఆడినట్లయితే మిడ్ ఆన్‌లో క్యాచ్ వచ్చేది." అని ఇయాన్ చాపెల్-మార్క్ టేలర్ స్పష్టం చేశారు.

విరాట్ కోహ్లీ ఈ ప్రపంచకప్ టోర్నీలో మూడు అర్ధశతకాలు సహా 220 పరుగులు చేశాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించిన కోహ్లీ.. ఒక్కసారి మాత్రమే తక్కువ పరుగులకు వెనుదిరిగాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

WhatsApp channel

సంబంధిత కథనం