Australia vs Tunisia FIFA 2022: ఫిఫా ప్రపంచకప్‌లో ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. ట్యూనిషియాపై విజయం -australia defeat with 1 0 against tunisia i fifa world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Australia Defeat With 1-0 Against Tunisia I Fifa World Cup 2022

Australia vs Tunisia FIFA 2022: ఫిఫా ప్రపంచకప్‌లో ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. ట్యూనిషియాపై విజయం

Maragani Govardhan HT Telugu
Nov 26, 2022 07:24 PM IST

Australia vs Tunisia FIFA 2022: ఫిఫా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు బోణీ కొట్టింది. గ్రూప్-డీలో భాగంగా ట్యూనిషియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా గ్రూప్-డీలో రెండో స్థానానికి చేరుకుంది.

ట్యూనిషియాపై ఆస్ట్రేలియా విజయం
ట్యూనిషియాపై ఆస్ట్రేలియా విజయం (REUTERS)

Australia vs Tunisia FIFA 2022: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ సమరం రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే అర్జెంటీనా, జర్మనీ లాంటి అగ్రశ్రేణి జట్లకు పరజాయాలు ఎదురయ్యాయి. తాజాగా శనివారం నాడు జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫిఫా 2022లో బోణీ కొట్టింది. ట్యూనిషియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో 1-4 తేడాతో ఘోరంగా ఓటమిని చూసిన ఆసీస్‌కు ఈ విజయంతో రౌండ్-16 ఆశలు సజీవంగా నిలిచాయి.

ట్రెండింగ్ వార్తలు

ట్యూనిషియాతో ఈ గెలుపుతో ఆస్ట్రేలియా గ్రూప్-డీలో రెండో స్థానానికి చేరుకుంది. మరోపక్క ట్యూనిషియాతో డెన్మార్క్‌తో జరిగిన తొలి మ్యాచ్ డ్రా కావడంతో ఆ జట్టు రౌండ్-16 ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్‌లో ఓటమితో తదుపరి దశకు వెళ్లే అవకాశం దాదాపుగా చేజారినట్లు కనిపిస్తుంది.

ఈ మ్యాచ్‌లో ఇరుజట్లకు పలు మార్లు గోల్ కొట్టే అవకాశం వచ్చింది. అయితే 23వ నిమిషంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ డ్యూక్ అద్భుత గోల్ సాధించడంతో ఆ జట్టు ఖాతా తెరిచింది. అనంతరం ట్యూనీషియా కూడా గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఆస్ట్రేలియా మాత్రం ఎక్కడా ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా బాగా డిఫెండ్ చేసింది. 1-0 తో ఉన్న లీడ్‌ను ఆస్ట్రేలియా చివరి వరకు అలాగే కొనసాగించింది. నిర్ణీత సమయం వరకు ఏ జట్టు కూడా మరో గోల్ కొట్టకపోవడంతో లీడ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

88వ నిమిషంలో ట్యూనిషియా ప్లేయర్ వాహిబీ ఖాజ్రీకి గోల్ కొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఫలితంగా చివరి వరకు ఆ లీడ్ అలాగే కొనసాగింది. 23వ నిమిషంలో ఆసీస్ స్ట్రైకర్ మిచెల్ డ్యూక్ కొట్టి ఈ గోల్ ఫిఫా 2022 ప్రపంచకప్‌లే 50వ గోల్ కావడం విశేషం.

WhatsApp channel

సంబంధిత కథనం