Cummins daughter: కెప్టెన్ డాటర్ వచ్చేసింది.. రెండోసారి తండ్రయిన కమిన్స్.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన బెక్కీ కమిన్స్-australia cricket captain cummins and his wife welcomed second child edi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cummins Daughter: కెప్టెన్ డాటర్ వచ్చేసింది.. రెండోసారి తండ్రయిన కమిన్స్.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన బెక్కీ కమిన్స్

Cummins daughter: కెప్టెన్ డాటర్ వచ్చేసింది.. రెండోసారి తండ్రయిన కమిన్స్.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన బెక్కీ కమిన్స్

Chandu Shanigarapu HT Telugu
Published Feb 08, 2025 09:42 AM IST

Cummins daughter: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండో సారి తండ్రయ్యాడు. అతని భార్య రెబెకా (బెక్కీ) కమిన్స్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి ఎడి అని పేరు పెట్టారు.

భార్య రెబెకాతో కమిన్స్
భార్య రెబెకాతో కమిన్స్ (Instagram)

రెండోసారి తండ్రయిన కమిన్స్.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన బెక్కీ కమిన్స్

ఆస్ట్రేలియా టెస్టు, వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈ కెప్టెన్ ఇంట్లోకి ఆడపిల్ల వచ్చేసింది. అతని భార్య రెబెకా (బెక్కీ) పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించిన కమిన్స్ దంపతులు ఆ పాపకు హృదయపూర్వక స్వాగతాన్ని పలికారు.

ఎడిని హత్తుకుని

రెబెకా పాపకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ చిన్నారిని గుండెలకు హత్తుకుని, ఆ పాప ముఖం వైపు ప్రేమగా చూస్తున్న ఫొటోను బెక్కీ కమిన్స్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘‘మా అందమైన బేబీ గర్ల్ ఎడి ఇక్కడికి వచ్చేసింది. మేం ఎంతటి ప్రేమను ఫీల్ అవుతున్నామో, ఎంతలా ఉప్పొంగిపోతున్నామో మాటల్లో వర్ణించలేం’’ అని ఆ పోస్టులో రెబెకా రాసుకొచ్చింది.

ఆ సిరీస్ కు దూరంగా కమిన్స్

భార్య రెబెకా డెలివరీ సమయంలో దగ్గర ఉండటం కోసం శ్రీలంకతో సిరీస్ కు కమిన్స్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇప్పటికే ఆల్బీ అనే కొడుకున్నాడు. అయితే ఆల్బీ జన్మించినప్పుడు కుటుంబానికి దూరంగా ఉన్న కమిన్స్.. ఇప్పుడు మాత్రం భార్యతోనే ఉండిపోయాడు. పితృత్వ సెలవులు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ కూడా ఇటీవల పాకిస్థాన్ తో సిరీస్ సందర్భంగా పితృత్వ సెలవులు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కమిన్స్ ఔట్

మరోవైపు గాయం కారణంగా ఈ నెల 19న ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరమయ్యాడు. హేజిల్ వుడ్, మిచెల్ మార్ష్ కూడా ఇంజూరీతో ఈ టోర్నీలో ఆడట్లేదు. స్టాయినిస్ ఏమో అర్ధంతరంగా వన్డేలకు వీడ్కోలు పలికాడు.

Whats_app_banner