Asian Kabaddi Championship 2023: ఆసియా చాంపియన్‍గా భారత్.. 8వసారి టైటిల్ కైవసం
Asian Kabaddi Championship 2023: భారత కబడ్డీ జట్టు మరోసారి ఆసియా చాంపియన్‍గా నిలిచింది. ఫైనల్‍లో ఇరాన్‍ను టీమిండియా చిత్తుచేసింది.
Asian Kabaddi Championship 2023: భారత కబడ్డీ జట్టు మరోసారి సత్తాచాటింది. ఆసియా చాంపియన్‍గా నిలిచింది. నేడు (జూన్ 30) జరిగిన ఆసియన్ కబడ్డీ చాంపియన్‍షిప్ 2023 ఫైనల్‍లో భారత్ 42-32 తేడాతో ఇరాన్‍పై విజయం సాధించింది. టైటిల్ కైవసం చేసుకుంది. దక్షిణా కొరియాలోని బుసాన్ వేదికగా ఈ టోర్నీ జరిగింది. ఫైనల్‍లో పది పాయింట్ల తేడాతో ఇరాన్‍ను చిత్తుచేసి.. 8వ సారి ఆసియన్ కబడ్డీ చాంపియన్‍షిప్ టైటిల్‍ను భారత్ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీ తొమ్మిదిసార్లు జరగగా.. ఎదిమిదిసార్లు టీమిండియానే చాంపియన్‍గా నిలిచింది.
ఇరాన్‍తో జరిగిన ఫైనల్‍లో టీమిండియా కెప్టెన్ పవన్ షెహ్రావత్ 10 పాయింట్లతో సత్తాచాటాడు. ఇక, ఈ మ్యాచ్ తొలి ఐదు నిమిషాల వెనుకబడిన టీమిండియా ఆ తర్వాత సత్తాచాటింది. 10వ నిమిషంలో పవన్, ఇనాందార్ సక్సెస్‍ఫుల్ రైడ్‍లతో మ్యాచ్ భారత్ వైపునకు తిరిగింది. అప్పటి నుంటి టీమిండియా చెలరేగింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి భారత్ 23-11తో ఆధిక్యంలో నిలిచింది.
అయితే, ఆ తర్వాత పోరు హోరాహోరీగా సాగింది. ఓ దశలో పాయింట్లు 38-31కు చేరాయి. అయితే, మళ్లీ భారత్ పుంజుకుంది. 42-32 తేడాతో మ్యాచ్‍ను కైవసం చేసుకొని.. ఆసియన్ చాంపియన్‍షిప్ టైటిల్‍ను దక్కించుకుంది.
అంతకు ముందు, హాంకాంగ్‍ను భారత్ 64-20తో చిత్తు చేసి.. లీగ్ స్టేజ్‍లో ఓటమి లేకుండా ఫైనల్‍లో అడుగుపెట్టింది. ఇండియా, ఇరాన్, జపాన్, కొరియా, చైనీస్ తైపీ, హాంకాంగ్ జట్లు ఈ ఆసియన్ చాంపియన్‍షిప్ టోర్నీలో తలపడ్డాయి. పాయింట్ల పట్టికలో టాప్‍లో నిలిచిన భారత్, ఇరాన్ మధ్య ఈ ఫైనల్ జరిగింది.
ఇక భారత కబడ్డీ జట్టుకు తదుపరి ఆసియా గేమ్స్ కీలకంగా ఉంది. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్‍జవూ వేదికగా ఆసియా గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది.