Asia Cup 2023 Venue Shift: ఆసియా క‌ప్‌లో ఇండియా మ్యాచ్‌ల‌కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వ‌నుందా?-asia cup 2023 uae may host india matches remaining in pakistan
Telugu News  /  Sports  /  Asia Cup 2023 Uae May Host India Matches Remaining In Pakistan
ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్‌
ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్‌

Asia Cup 2023 Venue Shift: ఆసియా క‌ప్‌లో ఇండియా మ్యాచ్‌ల‌కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వ‌నుందా?

17 February 2023, 11:33 ISTNelki Naresh Kumar
17 February 2023, 11:33 IST

Asia Cup 2023 Venue Shift: ఆసియా క‌ప్ వేదిక‌పై సందిగ్ధ‌త వీడ‌టం లేదు. పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించ‌డానికి బీసీసీఐ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఇండియా మ్యాచ్‌ల‌కు సంబంధించి వేదిక‌ను మార్చ‌బోతున్న‌ట్లు తెలిసింది.

Asia Cup 2023 Venue Shift: 2023 ఆసియా క‌ప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే భార‌త్, పాకిస్థాన్ మ‌ధ్య నెల‌కొన్న విభేదాల దృష్ట్యా పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించేందుకు బీసీసీఐ అంగీక‌రించ‌డం లేదు. వేదిక మార్పుపై కొంత‌కాలంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.

తాజాగా ఓ కొత్త ప్ర‌తిపాద‌న తెర‌పైకి వ‌చ్చింది. ఇండియా మ్యాచ్‌ల‌కు యూఏఈని వేదిక‌గా ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. మిగిలిన మ్యాచ్‌ల‌ను పాకిస్థాన్‌లోనే నిర్వ‌హించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్లాన్ చేస్తోన్న‌ట్లు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ వేదిక మార్పుపై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఒప్పుకోవ‌డం అనుమాన‌మేన‌ని క్రికెట్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించ‌డానికి ఇండియా ఒప్పుకోని ప‌క్షంలో ఇండియాలో జ‌రిగే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో త‌మ జ‌ట్టు పాల్గొన‌ద‌ని పాక్ క్రికెట్ బోర్డ్ చైర్మ‌న్ న‌జ‌మ్ సేథీ ఇటీవ‌ల కామెంట్స్ చేశారు. న‌జ‌మ్ సేథీ కామెంట్స్ ఇరు దేశాల మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారాయి.

భార‌త్ ప‌ట్టుద‌ల‌ను షాహిద్ అఫ్రిదీతో పాటు మ‌రికొంద‌రు పాకిస్థాన్ క్రికెట‌ర్లు త‌ప్పుప‌ట్టారు. బీసీసీఐ బ‌లంగా ఉండ‌టంతో దానిని ఎదురించి మిగిలిన స‌భ్య దేశాలు ఏం చేయ‌లేక‌పోతున్నాయంటూ అఫ్రిదీ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 9 నుంచి ఆసియా క‌ప్ ప్రారంభంకానుంది.