Asia Cup 2023:ఆసియా క‌ప్ వేదిక మార‌నుందా? - పాకిస్థాన్ నుంచి షిప్ట్ అయ్యేది ఎక్క‌డికంటే-asia cup 2023 likely to be shifts pakistan to uae ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Asia Cup 2023 Likely To Be Shifts Pakistan To Uae

Asia Cup 2023:ఆసియా క‌ప్ వేదిక మార‌నుందా? - పాకిస్థాన్ నుంచి షిప్ట్ అయ్యేది ఎక్క‌డికంటే

Nelki Naresh Kumar HT Telugu
Feb 05, 2023 10:21 AM IST

Asia Cup 2023: ఆసియా క‌ప్ 2023 వేదిక మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పాకిస్థాన్‌లో జ‌ర‌గాల్సిన ఆసియా క‌ప్‌ను యూఏఈకి షిఫ్ట్ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

బాబ‌ర్ ఆజాం, రోహిత్ శ‌ర్మ‌
బాబ‌ర్ ఆజాం, రోహిత్ శ‌ర్మ‌

Asia Cup 2023: ఆసియా 2023 వేదిక మార‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పాకిస్థాన్ నుంచి యూఏఈకి షిఫ్ట్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆసియా క‌ప్ 2023 సెప్టెంబ‌ర్ 9 నుంచి పాకిస్థాన్‌లో జ‌ర‌గాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

గ‌త కొన్నేళ్లుగా ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య స‌రైన స‌త్సంభందాలు లేవు. వాటి కార‌ణంగా పాకిస్థాన్‌లో జ‌రుగ‌నున్న‌ ఆసియా క‌ప్‌లో పాల్గొన‌డానికి భార‌త్ సుముఖంగా లేదు. ఇండియా టీమ్‌ను పాకిస్థాన్‌కు పంపించేది లేద‌ని గ‌తంలోనే బీసీసీఐ ఖ‌రాఖండిగా ప్ర‌క‌టించింది.

ఈ నేప‌థ్యంలో ఆసియా క‌ప్ వేదిక‌ను మార్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్ శ‌నివారం బ‌హ్రెయిన్‌లో జ‌రిగింది. ఈ మీటింగ్‌లో ఆసియా క‌ప్ వేదిక‌ను పాకిస్థాన్ నుంచి యూఏఈకి మార్చే విష‌య‌మై స‌భ్య దేశ‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలిసింది.

ఈ స‌మావేశంలో ఏసీసీ చైర్మ‌న్ జైషాతో పాటు పాకిస్థాన్ క్రికెట‌ర్ బోర్డ్ ఛైర్మ‌న్ న‌జామ్ సేథీ పాల్గొన్నారు. ఆసియా క‌ప్‌ను యూఏఈలో నిర్వ‌హిస్తే బాగుంటుంద‌ని మీటింగ్‌లో డిసైడ్ చేసిన‌ట్లు తెలిసింది. మార్చిలో మ‌రోసారి ఆసియా స‌భ్య దేశాలు స‌మావేశంకానున్నాయి. ఆ స‌మావేశంలో ఆసియా క‌ప్ వేదిక‌పై తుది నిర్ణ‌యాన్ని తీసుకోనున్న‌ట్లు తెలిసింది.

WhatsApp channel