Ashwin Rare Record: టెస్టుల్లో అశ్విన్ రేర్ ఫీట్ - క‌పిల్ దేవ్ త‌ర్వాత రెండో బౌల‌ర్ అత‌డే!-ashwin surpass anil kumble record in test cricket ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Ashwin Surpass Anil Kumble Record In Test Cricket

Ashwin Rare Record: టెస్టుల్లో అశ్విన్ రేర్ ఫీట్ - క‌పిల్ దేవ్ త‌ర్వాత రెండో బౌల‌ర్ అత‌డే!

HT Telugu Desk HT Telugu
Jul 24, 2023 12:42 PM IST

Ashwin Rare Record: టెస్ట్‌ల్లో టీమ్ ఇండియా స్పిన్న‌ర్‌ అశ్విన్ అరుదైన రికార్డ్ నెల‌కొల్పాడు. క‌పిల్ దేవ్ త‌ర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.

రవిచంద్రన్ అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్

Ashwin Rare Record: వెస్టిండీస్‌తో జ‌రుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ అద‌ర‌గొడుతోన్నాడు. తొలి టెస్ట్‌లో ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసి టీమ్ ఇండియాకు అదిరిపోయే విజ‌యాన్ని అందించాడు. సెకండ్ టెస్ట్‌లో మూడు వికెట్లు తీసుకొన్నాడు. నాలుగు రోజు ముగిసే స‌మ‌యానికి వెస్టిండీస్ కోల్పోయిన రెండు వికెట్లు అశ్విన్‌కే ద‌క్కాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ క్ర‌మంలో అశ్విన్ టెస్టుల్లో రేర్ రికార్డ్‌ను నెల‌కొల్పాడు. వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన రెండో టీమ్ ఇండియా బౌల‌ర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో 89 వికెట్ల‌తో క‌పిల్ దేవ్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.

75 వికెట్ల‌తో అశ్విన్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. అశ్విన్ కంటే ముందు 74 వికెట్ల‌తో అనిల్ కుంబ్లే రెండో స్థానంలో ఉండ‌గా అత‌డి రికార్డ్‌ను రెండో టెస్ట్‌తో అశ్విన్ తిర‌గ‌రాశాడు. ఇప్ప‌టివ‌ర‌కు 94 టెస్ట్‌లు ఆడిన 489 వికెట్లు తీసుకున్నాడు.

ఐదు వంద‌ల మైలురాయికి మ‌రో ప‌ద‌కొండు వికెట్ల దూరంలో ఉన్నాడు. అంతే కాకుండా 94 టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఇండియ‌న్ బౌల‌ర్‌గా అశ్విన్ నిలిచాడు. 94 టెస్టుల్లో అనిల్ కుంబ్లే 460 వికెట్లు తీసుకున్నాడు. ఐదు రోజు కూడా అశ్విన్ పైనే టీమ్ ఇండియా ఆశ‌లు పెట్టుకున్న‌ది. అత‌డు రాణించ‌డంపైనే టీమ్ ఇండియా విజ‌య‌వ‌కాశాలు ఆధార‌ప‌డ్డాయి.