Gukesh vs Arjun: ఇదేం వింత.. ఆడిన గుకేశ్ కంటే ఆడని అర్జున్ కే ఎక్కువ ప్రైజ్ మనీ
Gukesh vs Arjun: ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్ లో తొలి అంచె పోటీల్లో ఆడిన గుకేశ్ కంటే ఆడని అర్జున్ కు ఎక్కువ ప్రైజ్ మనీ దక్కింది. ప్రపంచ నంబర్ వన్ గుకేశ్ ఈ పోటీల్లో ఒక్క విజయం సాధించలేకపోయాడు.

ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్ లో భాగంగా ఫస్ట్ లెగ్ టోర్నీ తాజాగా జర్మనీలోని వీసెన్ హాస్ లో జరిగింది. ఈ టోర్నీలో ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ ఒక్క విజయమూ సాధించలేదు. ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. దీంతో అతను సుమారు రూ.17.33 లక్షలు (20 వేల డాలర్లు) ప్రైజ్ మనీ పొందాడు.
అర్జున్ కు రూ.23 లక్షలు
ఈ టోర్నీలో ఆడకపోయినా అర్జున్ ఇరిగేశి ఖాతాలో రూ.23.51 లక్షలు (27,132 డాలర్లు) చేరాయి. దీని వెనుక ఓ కారణం ఉంది. ఫ్రీస్టైల్ చెస్ ప్లేయర్స్ క్లబ్ లో భాగమైన అర్జున్ నాన్ పార్టిసిపేటింగ్ మెంబర్ గా ఉన్నాడు. ఇలా టోర్నీలో ఆడని వాళ్ల ఎలో రేటింగ్ 2725 కంటే ఎక్కువగా ఉంటే ఒక్కో పాయింట్ కు 357 డాలర్లు ఇస్తారు. ప్రస్తుతం 2801 ఎలో రేటింగ్ పాయింట్లు కలిగి ఉండటంతో అర్జున్.. గుకేశ్ కంటే ఎక్కువ మనీ గెలుచుకున్నాడు.
కార్లసన్ కు లక్ష డాలర్లు
ఈ టోర్నీ ఛాంపియన్ కీమర్ 2 లక్షల డాలర్లు సొంతం చేసుకున్నాడు. రన్నరప్ కరూనా 1,40,000 డాలర్లు ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు సెమీస్ లోనే ఓడిన ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ కు లక్ష డాలర్లు దక్కాయి. ఏప్రిల్ 8 నుంచి 15వ తేదీ వరకు జరిగే పారిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అర్జున్ బరిలో దిగబోతున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్