Argentina vs Australia fifa world cup̤: మెస్సీ సూపర్ గోల్ - క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టిన అర్జెంటీనా
Argentina vs Australia fifa world cup̤: ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ రౌండ్‌లో ఆస్ట్రేలియాపై అర్జెంటీనా 2-1 తేడాతో విజయాన్ని సాధించింది. కెప్టెన్ మెస్సీ అద్భుత గోల్‌తో ఈ మ్యాచ్‌లో మెరిశాడు. ఈ విజయంతో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

Argentina vs Australia fifa world cup̤: గ్రూప్ స్టేజ్‌లో అంచనాలకు తగ్గట్లుగా ప్రదర్శన చేయలేకపోయినా స్టార్ ప్లేయర్ మెస్సీ కీలక సమయంలో మెరిశాడు. మెస్సీ, అల్వరెజ్ మెరుపులతో శనివారం అర్థరాత్రి నాకౌట్ రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 తేడాతో విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ఆర్టెంటీనా క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.
ఆట ఆరంభం నుంచే ఆస్ట్రేలియాపై అర్జెంటీనా ఆధిపత్యం కనబరుస్తూ వచ్చింది. వరుసగా గోల్ పోస్ట్‌లపై దాడులు చేసింది. 35వ నిమిషంలో మెస్సీ గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 57వ నిమిషంలో జూలియస్ అల్వరెజ్ గోల్ చేయడంతో అర్జెంటీనా లీడ్ 2-0కు చేరింది. 77వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండేజ్ సెల్ఫ్ గోల్‌తో ఆస్ట్రేలియా బోణీ చేసింది. ఆట చివరలో మరో గోల్ చేసి స్కోరును సమం చేసేందుకు ఆస్ట్రేలియా చేసిన ప్రయత్నాల్ని అర్జెంటీనా గోల్ కీపర్ ఎమీ మార్టినెజ్ అద్భుతంగా అడ్డుకున్నాడు.
మెస్సీ రికార్డ్...
అర్జెంటీనా కెప్టెన్ మెస్సీకి ఇది 1000వ మ్యాచ్ కావడం గమనార్హం. కెరీర్ మొత్తంలో వరల్డ్ కప్ నాకౌట్ రౌండ్‌లో మెస్సీ ఇప్పటివరకు గోల్ చేయలేదు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తొలి గోల్ చేశాడు.
మొత్తంగా ఈ వరల్డ్ కప్‌లో మెస్సీకి ఇది మూడో గోల్ కావడం గమనార్హం. ఇప్పటివరకు అన్ని వరల్డ్ కప్‌లలో కలిపి 23 మ్యాచ్‌లు ఆడిన మెస్సీక ఇది తొమ్మిదో గోల్స్ చేశాడు. మారడోనా తర్వాత వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ రెండో స్థానంలో నిలిచాడు.
టాపిక్