Virat Kohli-Anushka : భర్తను ఇమిటేట్ చేసిన అనుష్క శర్మ.. సిగ్గుపడ్డ కోహ్లీ
Virat Kohli-Anushka : క్రికెట్‌లో సంతోషంగా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఎలా ప్రవర్తిస్తాడో అతడి భార్య అనుష్క శర్మ అనుకరించింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది.
అనుష్క శర్మ(Anushka Sharma) సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉండవచ్చు. కానీ ఆమె ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉండిపోతుంది. సోషల్ మీడియాలో అనుష్క ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. ఇదిలా ఉంటే, భర్త విరాట్ కోహ్లిని ఇమిటేట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీగా నవ్వుకుంటున్నారు.
వైరల్‌గా మారిన ఈ వీడియోను ఓ ఫ్యాన్ పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. అందులో క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) సంబరాలు చేసుకుంటే ఎలా చేస్తాడో అలా అనుష్క శర్మ చేసింది. తన భర్త చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో చూపించింది. ఈ వీడియోలో ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ నవ్వడం చూడవచ్చు. కోహ్లీని అనుష్మ ఇమిటేట్ చేసిన తర్వాత విరాట్ సిగ్గుపడుతూ నవ్వుతున్నాడు. తర్వాత భార్య అనుష్కను కూర్చోమని చెప్పాడు. కొన్ని సార్లు బౌలర్లు కూడా విరాట్ చేసినంత సంబరాలు చేసుకోరని అనుష్క చెప్పింది. ఈ క్యూట్ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
అనుష్క శర్మ ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో పాల్గొంది. తొలిసారి రెడ్ కార్పెట్‌పై స్టెప్పులేసింది. సోషల్ మీడియా(Social Media)లో అనుష్క శర్మ ఫోటోలు వైరల్ అయ్యాయి. భర్త విరాట్ కోహ్లీ హార్ట్ ఎమోజీని పంచుకోని స్పందించాడు. మరోవైపు అనుష్క శర్మ ఇటీవల పెద్దగా సినిమాలు చేయడం లేదు. నటనకు గుడ్ బై చెబుతుందని అంటున్నారు.
'నేను నటనను ఆస్వాదిస్తున్నాను. కానీ ఎక్కువ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఏడాదికి ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. నా జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలి. నా కుటుంబానికి సమయం ఇవ్వాలి.' అని అనుష్క చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అదే సమయంలో, అనుష్క శర్మ, సమంత మహిళా ప్రధాన వెబ్ సిరీస్‌లో కనిపించాలని భావిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నట్టు సమాచారం.