Praggnanandhaa: ప్రజ్ఞానందకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్.. తల్లిదండ్రులకు సలహా
Anand Mahindra Gift: భారతదేశం మరోసారి గర్వపడేలా చేసిన యువకుడు ప్రజ్ఞానంద. చెస్ ప్రపంచకప్ టోర్నమెంట్‍లో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఈ 18 ఏళ్ల యువ ఆటగాడిపై యావత్ భారతం ప్రశంసలు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజ్ఞానందకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారు.
Anand Mahindra Gift To Praggnanandhaa: ఫిడె వరల్డ్ కప్‍లో చరిత్ర సృష్టించాడు 18 ఏళ్ల చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద. చెస్ ప్రపంచకప్ టోర్నీలో అంతా అవాక్కయ్యేలా అత్యుత్తప్రదర్శనతో ఫైనల్స్ లోకి చేరిన ప్రజ్ఞానంద కొద్ది తడబాటుతో ఓటమిపాలయ్యాడు. ఆగస్ట్ 24న బాకు వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ టై బ్రేకర్‍లో మాగ్నస్ కార్ల్ సన్ చేతిలో ప్రజ్ఞానంద ఓటమి చవిచూశాడు. ఫైనల్ రెండు ఆటలను అద్భుతంగా ప్రదర్శించిన అతను కార్ల్ సన్ ఎత్తులకు తడబడటంతో ఓడిపోయాడు.
అయితే చెస్ ప్రపంచకప్ ఫైనల్ చేరిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రజ్ఞానంద. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ చేరిన రెండో చెస్ భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద మరో రికార్డ్ దక్కించున్నాడు. దీంతో ప్రజ్ఞానందపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ప్రజ్ఞానందకు మహీంద్ర థార్ కారును బహుమతిగా ఇవ్వాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాను కోరారు. అయితే క్రీడల్లో మంచి ప్రదర్శన చూపిన ఆటగాళ్లకు మహీంద్రకు చెందిన స్పెషల్ ఎడిషన్ వాహనాలను గిప్టుగా ఇస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రను ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వాలని నెటిజన్లు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా వారి వినతిని మన్నించారు. "ప్రజ్ఞానందకు థార్ వాహనాన్ని గిఫ్టుగా ఇవ్వమని చాలా మంది కోరుతున్నారు. కానీ, నా మనసులో మరో ఆలోచన ఉంది. ప్రజ్ఞానంద తల్లిదండ్రులు తమ కొడుకుని చిన్నప్పటి నుంచి చదరంగం క్రీడలో ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. వారికి కృతజ్ఞతగా, పోత్సాహకరంగా మహీంద్ర XUV400 EVని బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నాను" అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
అలాగే ఈ ట్వీటులో ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్ బాబును గౌరవించనున్నట్లు ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఆ దంపతుల పోత్సాహం వల్లే ప్రజ్ఞానంద వరల్డ్ లోనే అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడు అని తెలిపారు. అలాగే తల్లిదండ్లులు తమ పిల్లలకు వీడియో గేమ్‍లకు బదులుగా చెస్ నేర్పించాలని పేరెంట్స్ కు సలహా ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. కాగా 2005లో చెన్నైలో జన్మించిన ప్రజ్ఞానంద చిన్నతనం నుంచే చదరంగంలో రాణిస్తూ పలు అవార్డ్స్ సాధించాడు.
టాపిక్