Pak vs Afg: పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఆఫ్ఘ‌నిస్తాన్ - తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో విక్ట‌రీ-afghanistan beat pakistan by 6 wickets in first t20 match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Afghanistan Beat Pakistan By 6 Wickets In First T20 Match

Pak vs Afg: పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఆఫ్ఘ‌నిస్తాన్ - తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో విక్ట‌రీ

Nelki Naresh Kumar HT Telugu
Mar 25, 2023 07:16 AM IST

Pak vs Afg: షార్జా వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘ‌నిస్తాన్ చిత్తుచేసింది. ఆఫ్ఘ‌న్ బౌలింగ్ ధాటికి పాకిస్థాన్ 92 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

పాకిస్థాన్ వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్‌
పాకిస్థాన్ వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్‌

Pak vs Afg: పాకిస్థాన్‌కు ప‌సికూన ఆఫ్ఘ‌నిస్తాన్ షాకిచ్చింది. షార్జా వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన తొలి టీ20లో పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘ‌నిస్తాన్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది. ఆఫ్ఘ‌నిస్తాన్ బౌలింగ్ ధాటికి చేతులెత్తేసిన పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి కేవ‌లం 92 ప‌రుగులు మాత్ర‌మే చేశారు.

ట్రెండింగ్ వార్తలు

18 ప‌రుగుల‌తో ఇమాద్ వ‌సీమ్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 65 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌ను ఇమాద్ వ‌సీమ్‌, కెప్టెన్ షాబాద్‌ఖాన్ క‌లిసి 90 ప‌రుగులు ధాటించారు. ఆఫ్ఘ‌నిస్తాన్ బౌల‌ర్ల‌లో ముజీబ్ నాలుగు ఓవ‌ర్లు వేసి 9 ర‌న్స్ ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. న‌బీ, ఫ‌రుఖీ ల‌కు త‌లో రెండు వికెట్లు ద‌క్కాయి.

93 ప‌రుగులు టార్గెట్‌ను నాలుగు వికెట్లు కోల్పోయి 17 ఓవ‌ర్ల‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ ఛేదించింది. బ్యాటింగ్‌లోనూ రాణించిన న‌బీ 38 ప‌రుగుల‌తో ఆఫ్ఘ‌న్‌కు విక్ట‌రీని అందించాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ ఆజాంతో పాటు ప‌లువురు సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌కు పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.

WhatsApp channel