AB de Villiers: ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ ఫేవరెట్ టీ20 ప్లేయర్ ఎవరో తెలుసా.. మీరు ఊహించలేరు-ab de villiers says his all time greatest t20 players is rashid khan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ab De Villiers Says His All Time Greatest T20 Players Is Rashid Khan

AB de Villiers: ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ ఫేవరెట్ టీ20 ప్లేయర్ ఎవరో తెలుసా.. మీరు ఊహించలేరు

Hari Prasad S HT Telugu
Mar 06, 2023 07:08 PM IST

AB de Villiers: ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ ఫేవరెట్ టీ20 ప్లేయర్ ఎవరో మీరు ఊహించగలరా? మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ గా ఎంతోమందికి ఫేవరెట్ ప్లేయర్ అయిన ఏబీ.. తన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ గురించి చెప్పాడు.

ఏబీ డివిలియర్స్
ఏబీ డివిలియర్స్

AB de Villiers: ప్రపంచ క్రికెట్ లో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ లో ఒకడు ఏబీ డివిలియర్స్. ఈ సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ మిస్టర్ 360 డిగ్రీస్ గా క్రికెట్ అభిమానులకు పరిచయం. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు ఆడి.. అక్కడి ఫ్యాన్స్ కు దగ్గరయ్యాడు. ఈ మెగా లీగ్ పై అతడు తనదైన ముద్ర వేశాడు. అసలుసిసలు టీ20 బ్యాటర్ అంటే ఇలా ఉండాలనిపించేలా ఏబీ ఆడేవాడు.

ట్రెండింగ్ వార్తలు

అలాంటి ప్లేయర్ తన ఇప్పుడు తన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ ఎవరో వెల్లడించాడు. అది తన బెస్ట్ ఫ్రెండ్ విరాట్ కోహ్లియో లేక యూనివర్స్ బాస్ క్రిస్ గేలో కాదు. ఏబీ ఫేవరెట్ టీ20 ప్లేయర్ ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన రషీద్ ఖాన్ కావడం విశేషం. సూపర్ స్పోర్ట్ తో మాట్లాడిన ఏబీ.. రషీద్ తన ఫేవరెట్ ఎందుకో కూడా వివరించాడు.

"రషీద్ ఖానే నా గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్. అతడు బ్యాట్, బాల్ తో సత్తా చాటుతాడు. రెండింట్లోనూ అతడో మ్యాచ్ విన్నర్. ఫీల్డ్ లోనూ చురుగ్గా ఉంటాడు. చాలా ధైర్యవంతుడు. అతడు ఎప్పుడూ గెలవాలని అనుకుంటాడు. చాలా కాంపిటీటివ్. బెస్ట్ టీ20 ప్లేయర్స్ లో ఎప్పుడూ ముందే ఉంటాడు. నిజానికి బెస్ట్ లలో ఒకడు కాదు.. అతడే బెస్ట్" అంటూ రషీద్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

2015లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచీ రషీద్ వార్తల్లో నిలుస్తున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్ల పని పడుతున్నాడు. టీ20ల్లో డ్వేన్ బ్రేవో తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రషీద్ ఖానే. ఇప్పటి వరకూ 382 టీ20ల్లో రషీద్ 514 వికెట్లు తీసుకున్నాడు. అతని సగటు కేవలం 18.17 కావడం విశేషం.

ఐపీఎల్లోనూ రషీద్ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ రాటుదేలాడు. గత సీజన్ నుంచి గుజరాత్ టైటన్స్ కు ఆడుతున్నాడు. ఆ టీమ్ లీగ్ గెలవడంలో రషీద్ కీలకపాత్ర పోషించాడు. బ్యాట్ తోనూ పలు మ్యాచ్ లలో రాణించాడు.

WhatsApp channel

సంబంధిత కథనం