AB de Villiers on T20 World Cup: ఈసారి ఇండియాదే టీ20 వరల్డ్‌కప్ అంటున్నాడు సౌతాఫ్రికా లెజెండరీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. వరల్డ్‌కప్ విజేతపై జోస్యం చెప్పాడు.
ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడతాయని, ఇండియా కప్పు గెలుస్తుందని అతడు చెప్పడం విశేషం. ఇక సూర్యకుమార్, విరాట్ కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని.. రోహిత్ శర్మ ప్రస్తుతం అంతగా టచ్‌లో లేకపోయినా అవసరమైనప్పుడు చెలరేగుతాడని అన్నాడు.
ప్రతి ఒక్కరూ బాగా ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో గెలిస్తే.. కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందని చెప్పాడు. ఇంగ్లండ్‌తో సెమీసే పెద్ద సవాలని అన్నాడు. సూర్యకుమార్ ఆడుతున్న తీరు చాలా బాగుందని, అతడు తన గేమ్‌ప్లాన్‌కు కట్టుబడి ఉంటే చాలని ఏబీ చెప్పాడు.