Coral Reef | సముద్ర గర్భంలో వాతావరణ మార్పులను తట్టుకొని నిలబడిన కోరల్ రీఫ్
ప్రపంచంలోని చాలా కోరల్ రీఫ్స్ సముద్ర గర్భంలో 25 మీటర్ల లోతులో ఉష్ణ జలాల్లో కనిపిస్తాయి. కానీ తాహితి తీరంలో కనిపించిన ఈ ప్రాచీన రీఫ్‌కు.. ఇప్పటికీ తగిన సూర్యరశ్మి తగులుతోంది. ఇలాంటి ప్రాంతాన్నే ట్విలైట్ జోన్‌గా పిలుస్తారు. కోరల్ ఎదగడానికి, పునరుత్పత్తికి ఈ సూర్యరశ్మి ఎంతో అవసరం.
ప్రపంచంలోని చాలా కోరల్ రీఫ్స్ సముద్ర గర్భంలో 25 మీటర్ల లోతులో ఉష్ణ జలాల్లో కనిపిస్తాయి. కానీ తాహితి తీరంలో కనిపించిన ఈ ప్రాచీన రీఫ్‌కు.. ఇప్పటికీ తగిన సూర్యరశ్మి తగులుతోంది. ఇలాంటి ప్రాంతాన్నే ట్విలైట్ జోన్‌గా పిలుస్తారు. కోరల్ ఎదగడానికి, పునరుత్పత్తికి ఈ సూర్యరశ్మి ఎంతో అవసరం.
(1 / 6)
పైన కనిపించే ఫొటోను @alexis.rosenfeld అనే వ్యక్తి తీశారు. ఇందులో ఫ్రెంచ్ నేషనల్ సెంటర్‌కు చెందిన ఓ రీసెర్చర్‌ను చూడొచ్చు. 2021 డిసెంబర్‌లో ఫ్రెంచ్ పోలినేసియాకు దగ్గరలో ఉన్న తాహితి తీరంలో ఉన్న కోరల్స్ సైంటిఫిక్ రీసెర్చ్ అధ్యయనం కోసం ఈ రీసెర్చర్ వెళ్లారు.
(AP)(2 / 6)
ఇక్కడున్న కోరల్స్ అన్నీ గులాబీ పూల ఆకారంలో కనిపించడం మనం చూడొచ్చు. ప్రపంచంలోని చాలా రీఫ్స్ వాతావరణ మార్పుల వల్ల ప్రభావితం అవుతుండగా.. ఈ రీఫ్ మాత్రం చెక్కుచెదరలేదు. ఈ లోతులో కనిపించే అనేక రీఫ్స్‌లో ఇదీ ఒకటి.
(AP)(3 / 6)
పై ఫొటోను డిసెంబర్ 12, 2021లో ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ అలెక్సిస్ రోసెన్‌ఫెల్డ్ తీశారు. ఇందులో కొత్తగా కనుగొన్న రీఫ్‌ను చూడొచ్చు. తాహితి తీరంలో కనిపించిన ఈ అద్భుతాన్ని చూస్తే.. ఇలాంటి మరెన్నో రీఫ్స్ మన మహాసముద్రాల్లో ఉండొచ్చని రాయ్‌టర్స్ ఓ రిపోర్ట్‌లో తెలిపింది.
(AFP)(4 / 6)
కొత్తగా కనిపెట్టిన ఈ రీఫ్‌లో ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌కు చెందిన రీసెర్చర్లు కోరల్స్‌ను అధ్యయనం చేయడం చూడవచ్చు. ఈ రీఫ్ ఇలా వృద్ధి చెందడానికి కనీసం 25 ఏళ్లు పట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. వీటిలో గులాబీ పూల ఆకారంలో ఉన్న కొన్ని రీఫ్స్ 2 మీటర్ల వ్యాసం కలిగి ఉండటం విశేషం.
(AP)(5 / 6)
హవాయిలోని కనోహి తీరంలోని కోరల్ రీఫ్ ఇది. ప్రపంచంలోని చాలా రీఫ్స్.. చేపల వేట, కాలుష్యం కారణంగా చనిపోతున్నాయి. 2009 నుంచి 2018 కాలంలో ప్రపంచంలోని రీఫ్స్‌లో 14 శాతం కోరల్స్ చనిపోయి ఉండొచ్చని గ్లోబల్ కోరల్ రీఫ్ మానిటరింగ్ ప్రాజెక్ట్ 2020 రిపోర్ట్ వెల్లడించింది.
(AP)(6 / 6)
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర జలాలు వేడెక్కుతుండటంతో చాలా వరకూ రీఫ్స్ ప్రమాదంలో పడ్డాయి. జలాలు వేడెక్కినప్పుడు కోరల్స్ కూడా వేడెక్కి బ్లీచింగ్‌కు గురవుతున్నాయి. అంటే అవి వాటి రంగును కోల్పోయి నిర్జీవంగా తయారవుతున్నాయి. ప్రపంచంలోని చాలా వరకూ కోరల్స్ పరిస్థితి ఇలాగే ఉన్నదని రాయ్‌టర్స్ రిపోర్ట్ ఒకటి వెల్లడించింది.
(AP)ఇతర గ్యాలరీలు