Zodiacs prone to the evil eye: ఈ రాశుల వారికి ఎక్కువగా నరదిష్ఠి తగులుతుంది.. జాగ్రత్త సుమా
Zodiacs prone to the evil eye: . జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశుల వారు ఆకర్షిస్తూ ఇతరులు దృష్టిలో త్వరగా పడతారు. అలాంటి వారికి ఎక్కువగా దిష్టి తగిలే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా చెడు కన్నుకు గురవుతారు. ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
చెడు కన్ను లేదా చెడు దృష్టి ఒక మనిషికి హాని కలిగిస్తుందని చాలా మంది నమ్ముతారు. చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో భాగంగా ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశుల వారు ఆకర్షిస్తూ ఇతరులు దృష్టిలో త్వరగా పడతారు. అలాంటి వారికి ఎక్కువగా దిష్టి తగిలే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా చెడు కన్నుకు గురవుతారు. ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు త్వరగా దిష్టికి గురవుతారు. సులువుగా ఇతరులని ఆకర్షిస్తారు. రహస్యాలని ఉంచగలుగుతారు. ఇతరుల అసూయ పడేలా వీళ్ళ స్వభావం ఉంటుంది. అందుకని సులువుగా నరదృష్టి వంటి వాటికి గురవుతూ ఉంటారు. ఇలా ప్రతికూల శక్తుల్ని సులభంగా గ్రహించేలా చేస్తుంది. చెడు దృష్టి బారిన పడకుండా ఉండడానికి కొన్ని పరిహారాలని పాటిస్తే మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారు కూడా సులువుగా ఇతరుల దృష్టిలో పడతారు. చెడు దృష్టికి గురవుతారు. వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి ప్రేమ కారణంగా కూడా సులువుగా ఇతరులు అసూయ పడుతూ ఉంటారు. ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నరదృష్టి వంటివి తగిలితే ఎంతో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని సింహ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి చెడు కన్ను సూచించే విధంగా జువెలరీని వేసుకుంటే మంచిది మీనరాశి మీన రాశి వారు సులువుగా ఇతరులని ఆకట్టుకుంటారు. ఈజీగా వీళ్ళు కూడా నరదృష్టికి గురవుతారు.
మీన రాశి
మీన రాశి వాళ్లు దయతో ఉంటారు. తరచుగా వారి చుట్టూ ఉన్న వారి భావోద్వేగాలని గ్రహిస్తారు. ఈ కనెక్షన్ వలన చెడు కన్నుకు గురవుతారు. అలాగే వీళ్ళలో ఉండే స్కిల్స్ ఇతరులను అసూయ పడేటట్టు చేస్తాయి. ధ్యానం చేయడంతో పాటుగా కొన్ని రకాల రాళ్ళను పెట్టుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుంది.
తులా రాశి
తులా రాశి వారు కూడా సులువుగా చెడు దృష్టి బారిన పడతారు. మనోజ్ఞత, చక్కదనం, సామరస సంబంధాలను ఏర్పర్చుకుంటూ ఎక్కువగా ఇతరులు అసూయపడతారు. ఇతరుల చెడు దృష్టి పడుతుంది. తులా రాశి వారు ప్రతికూల శక్తుని గ్రహించినప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండడానికి కొన్ని పరిహారాలను పాటించడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఎమోషనల్ గా ఉంటారు. వీళ్లు ప్రేమించే వారికి దగ్గరగా ఉంటారు. ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు. ఇది చూసి కొంతమందికి వాళ్ళపై అసూయ కలుగుతుంది. చెడు దృష్టి బారిన పడతారు. ఇంటిని, కుటుంబ సంప్రదాయ ఆచారాలను ఉపయోగించి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉప్పు వేయడం లేదంటే స్పటికని ఉంచడం వంటివి చేస్తే ఇతరుల దృష్టి పడదు.
ఈ పరిహారాలని పాటిస్తే చెడు దృష్టి పడదు. ఉప్పు నీటితో స్నానం చేయడం, ఇంటి ముందు స్పటికను పెట్టడం ఈవిల్ ఐ కలిగిన వాటిని ధరించడం వంటివి చేయొచ్చు. వీటి వలన నరదృష్టి, బాధలు ఉండవు. నరదృష్టికి నల్లరాళ్ళయినా కరిగిపోతాయి అని అంటారు. కాబట్టి నరదృష్టి బాధల నుంచి బయటపడడం చాలా అవసరం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.