Zodiac: డేట్ కి వెళ్తున్నారా? ఇలా చేస్తే మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది-zodiac tips to follow based your sign while going to date ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Zodiac: డేట్ కి వెళ్తున్నారా? ఇలా చేస్తే మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది

Zodiac: డేట్ కి వెళ్తున్నారా? ఇలా చేస్తే మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది

Peddinti Sravya HT Telugu
Dec 07, 2024 04:30 PM IST

Zodiac: నిజానికి ఒకరిని ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు. చాలామంది వన్ సైడ్ లవ్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరినొకరు ఇష్టపడడం అనేది కొంచెం కష్టమైనదే. మీ డేటింగ్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు రాశుల ప్రకారం ఇలా చేయడం మంచిది.

డేట్ కి వెళ్తున్నారా? ఇలా చేస్తే మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది
డేట్ కి వెళ్తున్నారా? ఇలా చేస్తే మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది

మీరు ఇష్టపడే వ్యక్తితో డేటింగ్ కి వెళ్లాలని అనుకుంటున్నారా? వాళ్ళది ఈ రాశి అయితే ఈ టిప్స్ మీకు పనికొస్తాయి. ఇక మీకు తిరుగు ఉండదు. మీ రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకు వెళ్లొచ్చు.

yearly horoscope entry point

నిజానికి ఒకరిని ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు. చాలామంది వన్ సైడ్ లవ్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరినొకరు ఇష్టపడడం అనేది కొంచెం కష్టమైనదే. పైగా మనం ప్రేమించే వ్యక్తి. మనల్ని తిరిగి ప్రేమించాలి అని ఏమీ లేదు. ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు ఇష్టపడుతుంటారు. మీ డేటింగ్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు రాశుల ప్రకారం ఇలా చేయడం మంచిది.

ఈ రాశుల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇవి బెస్ట్ ఐడియాస్

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని సినిమా చూడాలని అనుకుంటారు. కొద్దిగా స్నాక్స్ తింటూ అలా సమయాన్ని గడపాలి అనుకుంటారు. లేదంటే సరదాగా బీచ్ కి వెళ్లాలని అనుకుంటారు. కర్కాటక రాశి వారితో డేట్ కి వెళ్లాలంటే ఇలా సింపుల్ గా ఫాలో అవ్వండి.

సింహ రాశి

వీళ్ళు రాయలటీగా ఉండాలని అనుకుంటారు. వీళ్ళతో మీరు కొంచెం ఫ్యాన్సీ డిన్నర్ వంటివి ట్రై చేయండి. సినిమా థియేటర్ కి లేదంటే కాన్సెర్ట్ కి వెళితే వీళ్ళు ఇంప్రెస్ అవుతారు. నచ్చుతుంది కూడా.

కన్య రాశి

కన్య రాశి వాళ్లు ఎక్కువ ఆలోచిస్తారు. అలాగే ఫుల్ ప్లానింగ్ చాలా ముఖ్యం. కన్య రాశి వాళ్లతో సరదాగా సమయాన్ని స్పెండ్ చేయాలంటే పోటరీ క్లాస్ కి వెళ్ళడం మంచిది. లేదంటే సరదాగా కుకింగ్ వంటివి వీళ్ళతో పాటు చేస్తే వీళ్ళు ఇంప్రెస్ అవుతారు.

తులారాశి

వీళ్ళతో ఆర్ట్ గ్యాలరీ లేదా వైన్ టేస్టింగ్ ఈవెంట్స్ వంటివి ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటివి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే సాయంత్రం పూట సరదాగా రొమాంటిక్ గా ఉండడానికి సింపుల్ గా ఉండే ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వాళ్ళు థ్రిల్లింగ్ లేదా సస్పెన్స్ సినిమాలను చూడడానికి ఇష్టపడతారు. అందరిలా కాకుండా కొంచెం హిడెన్ స్పాట్స్ కి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వాళ్ళు రోడ్ ట్రిప్ ని ఇష్టపడుతుంటారు. హైకింగ్ వంటివి ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళతో డేటింగ్ కి వెళ్ళాలి అనుకుంటే ఇటువంటివి ప్లాన్ చేయండి.

మకర రాశి

వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటారు. వీళ్ళతో పాటు ఎక్కడికైనా వెళ్లాలంటే సరైన ప్లానింగ్ ఉండాలి. అప్పుడే వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతారు. ఒక మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేయడం ఇలా. డేట్స్ ఎప్పుడు క్లాసిక్ గా ఉండడం వీళ్ళకి నచ్చుతుంది. వీళ్ళు చాలా విభిన్నంగా ఉంటారు.

మీనరాశి

రొమాంటిక్ గా క్రియేటివ్ గా ఉండడానికి వెళ్లి ఇష్టపడుతుంటారు. సూర్యాస్తమయం టైంలో బోట్ రైడింగ్ లేదా పెయింటింగ్ క్లాస్, కవితలు చదవడం ఇలాంటివి వీళ్ళకి హార్ట్ టచింగ్ గా ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం