జేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగినీ ఏకాదశి అంటారు. హిందూ మతంలో యోగినీ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. యోగినీ ఏకాదశి నాడు భక్తితో ఉపవాసం ఉంటే, 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది.
యోగినీ ఏకాదశి జూన్ 21 శనివారం నాడు వచ్చింది. జ్యేష్ఠ మాసం కృష్ణ పక్ష ఏకాదశి జూన్ 21 ఉదయం 7:18కి మొదలవుతుంది, జూన్ 22 ఉదయం 4:27తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూడాలి కనుక జూన్ 21న యోగినీ ఏకాదశిని జరుపుకోవాలి.
శనివారం నాడు యోగినీ ఏకాదశి రావడం శుభప్రదం. ఈరోజు శ్రీ విష్ణుమూర్తిని భక్తి, శ్రద్ధలతో ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. యోగినీ ఏకాదశి నాడు ఈ పనులు కచ్చితంగా చేయండి.
యోగినీ ఏకాదశి అదీ శనివారం వచ్చినందున, ఈరోజు సరిగ్గా వినియోగించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి ప్రతికూల శక్తితో ఇబ్బంది పడుతున్నవారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు, ఏదో ఒక ఇబ్బంది వస్తున్నట్లు అనిపిస్తున్నవారు ఈ పరిహారాలను పాటించండి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు.
"ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి. అలా చేయడం వలన శ్రీ విష్ణువు అనుగ్రహం లభించి, సమస్యలన్నీ తీరిపోతాయి. సంతోషంగా ఉండవచ్చు. కష్టాలన్నీ తొలగిపోతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.