యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయం, ప్రాముఖ్యతతో పాటు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోండి!-yogini ekadashi date time significance and also check remedies to be followed on this auspicious day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయం, ప్రాముఖ్యతతో పాటు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోండి!

యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయం, ప్రాముఖ్యతతో పాటు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

హిందూ మతంలో, ప్రతి నెలా రెండు ఏకాదశి ఉపవాసాలు ఆచరిస్తారు. జూన్ నెలలో యోగిని ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఉందో తెలుసుకోండి. యోగిని ఏకాదశి తేదీ, సమయం, ప్రాముఖ్యతతో పాటు ఎలాంటి పరిహారాలను పాటించాలో కూడా తెలుసుకోండి. ఈ విధంగా ఆచరిస్తే మాత్రం విష్ణువు అనుగ్రహం కలిగి, సంతోషంగా ఉండచ్చు.

యోగిని ఏకాదశి తేదీ, సమయం

యోగిని ఏకాదశి 2025 తేదీ: జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని శుక్లపక్షం ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. జూన్ నెలలో వచ్చే రెండవ ఏకాదశి యోగిని ఏకాదశిగా జరుపుకుంటాము. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలు నశించి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం.

ఆ రోజు ఉపవాసం ఉండడం వలన సకల సంతోషాలను పొందవచ్చు. అంతే కాక యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మరణించిన తరవాత విష్ణు లోకానికి వెళ్లారు. యోగిని ఏకాదశి ఉపవాసం ఉండడం వలన 88,000 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానమని నమ్ముతారు.

యోగిని ఏకాదశి తేదీ, సమయం:

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఏకాదశి తిథి జూన్ 21, 2025 ఉదయం 07:18 గంటలకు ప్రారంభమై జూన్ 22 తెల్లవారుజామున 04:27 గంటలకు ముగుస్తుంది. కనుక ఈ ఏడాది యోగిని ఏకాదశిని 2025 జూన్ 21న జరుపుకోనున్నారు.

యోగిని ఏకాదశి ప్రాముఖ్యత:

యోగిని ఏకాదశి నిర్జల ఏకాదశి తరువాత, దేవశయని ఏకాదశికి ముందు వస్తుంది. ఈ ఉపవాసం పాటించడం ద్వారా జీవితంలో సంతోషం, శాంతి కలుగుతాయని నమ్ముతారు. ఈ ఏకాదశి నాడు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే ముందు విష్ణువును ఆరాధించడం ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

యోగిని ఏకాదశి పూజ ముహూర్తం 2025:

బ్రహ్మ ముహూర్తం- ఉదయం 04:04 నుంచి 04:44 వరకు

అభిజిత్ ముహూర్తం- ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:51 వరకు

విజయ్ ముహూర్తం- మధ్యాహ్నం 02:43 నుంచి 03:39 వరకు

గోధులి ముహూర్తం- 07:21 నుంచి 07:41 వరకు

ఉపవాస దీక్షకు మంచి సమయం మధ్యాహ్నం 01.47 నుండి 04.35 వరకు

యోగిని ఏకాదశి పరిహారాలు:

  1. యోగిని ఏకాదశి నాడు రావి చెట్టు కింద నేతితో దీపాన్ని వెలిగించడం వలన మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
  2. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లయితే యోగిని ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలో విష్ణుమూర్తిని ఆరాధించి తమలోపాకుపై 'ఓం విష్ణవే నమః' అని రాయాలి. ఆ తర్వాత దానిని విష్ణుమూర్తి పాదాల వద్ద పెట్టాలి. ఆ తర్వాత రోజు ఈ తమలపాకుని పసుపు వస్త్రంలో చుట్టి జాగ్రత్తగా ఉంచాలి.
  3. యోగిని ఏకాదశి నాడు విష్ణుమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేస్తే కూడా మంచిది. ఇలా చేయడం వలన ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.