ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి తిధి చాలా ప్రత్యేకమైనది. ఏకాదశి నాడు చాలామంది విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం కూడా చేస్తారు. ఈసారి యోగినీ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? యోగినీ ఏకాదశి నాడు ఏం చేస్తే మంచిది అనే విషయాలను తెలుసుకుందాం.
జూన్ 21, శనివారం నాడు యోగినీ ఏకాదశి వచ్చింది. జ్యేష్ఠ మాసం కృష్ణపక్ష ఏకాదశి జూన్ 21 ఉదయం 7:18కి మొదలై, జూన్ 22 ఉదయం 4:27 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కనుక యోగినీ ఏకాదశి జూన్ 21న జరుపుకోవాలి.
యోగినీ ఏకాదశి నాడు మహా విష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజున ఉపవాసం ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పద్మ పురాణం ప్రకారం, ఈరోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేసి మహా విష్ణువుని ప్రార్థిస్తారో వారికి ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సంపద పెరుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.