వాస్తు ప్రకారం కొన్ని పొరపాట్లు చేయడం వలన సానుకూల శక్తి తొలగిపోయి, ప్రతికూల శక్తి కలుగుతుంది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఇంట్లో ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటాయి. వాస్తు ప్రకారం వాచీకి సంబంధించి కొన్ని పొరపాట్లు చేయకూడదు.
వాచీకి సంబంధించి ఈ పొరపాట్లు చేసినట్లయితే, ఇంట్లో ఇబ్బందులు తప్పవు. చాలా మంది చేతికి వాచీ పెట్టుకుంటారు. అయితే వాచీని పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి. లేదంటే కష్టాలు కొన్ని తెచ్చుకున్నట్లవుతుంది.
మనం ముందు వాచీని కొనుక్కునేటప్పుడు డయల్ ఆకారం చూస్తాము. డయల్ పెద్దదిగా ఉందా, చిన్నదిగా ఉందా అనేది చూస్తాము. అయితే వాచీని పెట్టుకునేటప్పుడు పెద్ద డయల్ ఉన్న వాటిని పెట్టుకోకూడదు. ఇలాంటివి పెట్టుకుంటే సమస్యలు కలుగుతాయి. కుటుంబ సమస్యలతో పాటుగా ఉద్యోగ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మరీ చిన్నది అయ్యి ఉండకూడదు.
వాచీని పెట్టుకునేటప్పుడు ఎడమ చేతికైనా పెట్టుకోవచ్చు. లేదంటే కుడి చేతికైనా పెట్టుకోవచ్చు. మీ సౌకర్యాన్ని బట్టీ పెట్టుకోండి. అప్పుడు సులువుగా టైం చూసుకోవడానికి బాగుంటుంది.
కొంతమంది పని చేయని వాచీలను పెట్టుకుంటారు. ఆ పొరపాటు కూడా చేయద్దు. ఎందుకంటే ఇది ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. దీనితో సమస్యలు వస్తాయి.
బంగారం, వెండి రంగుల్లో ఉండే వాచీని పెట్టుకుంటే మంచిది. ఈ రంగుల వాచీలని పెట్టుకోవడం వలన విజయాన్ని అందుకోవచ్చు.
చాలామంది వాచీలని రాత్రి నిద్ర పోయేటప్పుడు లేదంటే బయట నుంచి వచ్చాక దిండు కింద పెడుతూ ఉంటారు. పరుపు కింద లేదా దిండు కింద పెట్టడం మంచిది కాదు. ఇది సానుకూల శక్తిని తొలగించేసి, ప్రతికూల శక్తి కలిగేటట్టు చేస్తుంది.
పైగా నిద్ర సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం చేతికి వాచీని పెట్టుకోవడం వలన సక్సెస్ ని అందుకోవచ్చు. అన్నీ కలిసి వస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం