Lord hanuman: మహిళలు హనుమాన్ జయంతి రోజు పూజ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి-women should keep these things in mind while performing lord hanuman puja on hanuman jayanti ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Hanuman: మహిళలు హనుమాన్ జయంతి రోజు పూజ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి

Lord hanuman: మహిళలు హనుమాన్ జయంతి రోజు పూజ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి

Gunti Soundarya HT Telugu
Apr 22, 2024 12:19 PM IST

Lord hanuman: హనుమాన్ జయంతి రోజు మహిళలు ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాటి ప్రకారమే హనుమంతుడిని పూజించాలి.

మహిళలు హనుమంతుడిని పూజించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మహిళలు హనుమంతుడిని పూజించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (pinterest)

Lord hanuman: హనుమంతుడిని కలియుగ దైవంగా భావిస్తారు. ఇప్పటికే హనుమంతుడు జీవించే ఉన్నాడని చాలామంది నమ్ముతారు. భక్తి, విధేయతకు ప్రతిరూపంగా హనుమంతుడిని పూజిస్తారు. మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు. అందుకే ఆరోజు ఆంజనేయుడు అనుగ్రహం కోరుతూ ఉపవాసం పాటిస్తారు.

yearly horoscope entry point

ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న వచ్చింది. ఆచారాల ప్రకారం బజరంగబలిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కాలంలో హనుమాన్ చాలీసా పఠించడం, దానధర్మాలు వంటివి చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆంజనేయుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత పొందడంతో పాటు నిర్భయంగా ఉంటారు. 

బజరంగబలిని ఆరాధించే విషయంలో మాత్రం పురుషులు, స్త్రీలకు సమాన స్థాయిలో అనుమతులు ఉండవు. హనుమంతుడిని పూజించేటప్పుడు మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా చెప్తారు. అది మాత్రమే కాకుండా ప్రపంచంలోనే స్త్రీలందరిని తన తల్లిగా భావిస్తాడు.

హనుమంతుడి పూజా సమయం 

హనుమాన్ జయంతి రోజు పూజ సమయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. శుభ సమయంలో చేయని పూజ ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఉద్యమా 4.20 గంటల నుంచి 5.04 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11.53 గంటల నుంచి మధ్యాహ్నం 12.46 వరకు ఉంది. హనుమంతుడి ఆరాధనకు సమయం ఉదయం 9.03 గంటల నుంచి 10.41 గంటల వరకు ఉంది. 

మహిళలు ఈ జాగ్రత్తలు తప్పనిసరి 

హనుమంతుడి విగ్రహాన్ని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా ఆయన పాదాలను తాకకూడదు. ఎందుకంటే హనుమంతుడు ప్రపంచంలోనే ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు. అందుకే దూరం నుంచి మాత్రమే ఆయనను పూజించాలి.

ఈ సమయంలో మహిళలు హనుమంతుడిని పంచామృతంతో అభిషేకం చేయకూడదు. పురుషులు చేయవచ్చు. 

హనుమాన్ కి మహిళలు చోళం, సింధూరం సమర్పించకూడదు. అయితే పూలదండను తయారుచేసి పురుషులతో దండ వేయించి నమస్కరించుకోవచ్చు. 

ఈ సమయంలో మీరు బజరంగబలి కోసం ప్రసాదాన్ని తయారు చేయొచ్చు. కానీ అది మీరు సమర్పించకూడదు. పురుషులకు ఇచ్చి దేవుడికి నైవేద్యంగా పెట్టించాలి.

మహిళలు బజరంగ్ బాన్ పఠించకూడదు. అలా చేయడాన్ని అశుభంగా భావిస్తారు. హనుమాన్ చాలీసా మాత్రం పఠించకూడదు. 

స్త్రీలు హనుమంతునికి వస్త్రాలు, యాగ్యోపవీతం కూడా సమర్పించకూడదు. 

హనుమంతుడిని సనాతన ధర్మంలో భక్తుల కోరికలు తీర్చేవాడిగా నమ్ముతారు.  శ్రీరామ నామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడని భక్తుల విశ్వాసం. హనుమంతుని ఆశీర్వాదం ఉంటే ఎటువంటి భయాలు చుట్టుముట్టలేవు. వారి జాతకంలో ఉన్న ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావాలు కూడా తగ్గుతాయి. 

మహిళలు ఈ పనులు చేయవచ్చు 

మహిళలు మంగళవారం ఉపవాసం పాటించవచ్చు. దీనిపై ఎలాంటి ఆంక్షలు లేవు.  ఒకవేళ ఉపవాసం ఉంటే ఉప్పు, ధాన్యాలు తినకూడదు. 

మహిళలు తమ చేతులతో హనుమంతుడికి ప్రసాదాన్ని తయారు చేయవచ్చు.  కానీ సమర్పించకూడదు. 

హనుమాన్ చాలీసా, హనుమాన్ అష్టకం, సుందరకాండ మొదలైన వాటిని పఠించవచ్చు. 

ధూప, దీప౦, పువ్వులు మొదలైన వాటిని సమర్పించి పూజ చేయవచ్చు. 

 

Whats_app_banner