Hanuman Puja: హనుమంతుడిని పూజించేటప్పుడు మహిళలు ఎట్టిపరిస్థితుల్లో ఈ 5 పొరపాట్లు చేయకూడదు
Hanuman Puja: హనుమంతుడిని పూజించేటప్పుడు మహిళలు కొన్ని నియమాలని పాటించాలి. మరి మహిళలు మీరు పూజ చేసేటప్పుడు, ఎటువంటి నియమాలను కచ్చితంగా పాటించాలో ఇప్పుడే తెలుసుకోండి.

భక్తిశ్రద్ధలతో మనం భగవంతుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. అలాగే, మహిళలు ప్రతీ రోజూ రెండు పూట్ల దీపారాధన చేస్తూ ఉంటారు. దాని వలన కూడా ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అయితే, హనుమంతుడిని ఆరాధించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. హనుమంతుడిని ఆరాధించడం వలన దుఃఖం తొలగిపోతుంది.
ఎవరైనా హనుమంతుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే, కోరికలన్నీ కచ్చితంగా నెరవేరుతాయి అని నమ్ముతారు. హనుమంతుడు మంచి ఫలితాలను ఇచ్చి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడు.
హనుమంతుడిని పూజించేటప్పుడు మాత్రం మహిళలు కొన్ని నియమాలని పాటించాలి. మరి మహిళలు మీరు పూజ చేసేటప్పుడు, ఎటువంటి నియమాలను కచ్చితంగా పాటించాలో ఇప్పుడే తెలుసుకోండి.
హనుమంతుడిని ఆరాదించేటప్పుడు మహిళలు కచ్చితంగా పాటించాల్సినవి:
- హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా మహిళలు కొన్ని నియమాలని పాటించాలి. ముఖ్యంగా నెలసరి సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు.
- హనుమంతుడిని ఆరాధించేటప్పుడు పరిశుభ్రతని పాటించాలి. స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత ఇంట్లో పూజైనా, ఆలయానికి వెళ్లాలన్నా.
- నెలసరి సమయంలో హనుమంతుడిని పూజించకూడదు. అలా చేయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది.
- హనుమంతుడిని ఆరాధించేటప్పుడు పురుషులైనా, స్త్రీలైనా నమ్మకంతో పూజించాలి. పూర్తి విశ్వాసం, భక్తిని కలిగి ఉండాలి. ఆయన పట్ల మీ విశ్వాసం నిజం కాకపోతే ఆయన ఆశీర్వాదాలను మీరు పొందలేరు.
- హనుమంతుడిని ఆరాధించిన తర్వాత పండ్లు, పువ్వులు, స్వీట్లు, రుచికరమైన వస్తువులని సమర్పించాలి. హనుమంతుడి విగ్రహాన్ని మాత్రం తాకకూడదు. అలాగే సింధూరాన్ని కూడా హనుమంతుడి మీద జల్లకూడదు.
ఈ మంత్రాలని పఠించండి
మహిళలు హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి వీటిని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది. హనుమంతుని ఆరాధించేటప్పుడు హనుమాన్ చాలీసా చదివితే విశేష ఫలితాన్ని పొందవచ్చు.
అలాగే తక్కువ స్వరంతో హనుమంతుని మంత్రాలను జపించాలి. ఇలా చేస్తే కుటుంబంలో హనుమంతుని ఆశీస్సులు ఉంటాయి. సుఖసంతోషాలు పొందవచ్చు. నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం