Shani Gochar: దేవదీపావళి తరవాత శని సంచారం.. ఈ రాశుల వారు ఇవి గుర్తుంచుకోండి
శని సంచారం: కార్తీకపౌర్ణమి రోజున వచ్చే దేవదీపావళి తర్వాత అనేక రాశుల వారు ప్రభావితమవుతారు. ముఖ్యంగా దేవదీపాలి రోజున వివిధ రాశులపై శని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. శని సంచారం కారణంగా మూడు రాశుల వారు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
కర్మఫలితాలను అందించే శని దేవుడు ఏ వ్యక్తికైనా మంచి చెడుల ఫలాలను మాత్రమే ఇస్తాడు. మీరు మంచి పనులు చేస్తే శని మీకు ప్రయోజనాలను ఇస్తాడు. దీనికి విరుద్ధంగా చెడు పనులు చేసే వారికి శని దాని ఫలితాన్ని కూడా ఇస్తాడు. శని తిరోగమనం అనేది అనేక రాశులపై ప్రభావం చూపుతుంది. కార్తీకమాసంలో వచ్చే దేవతదీపావళి రోజున శని దేవుడు తన స్థితిని మార్చుకుంటున్నాడు. దాని ప్రభావం ఓ మూడు రాశులపై ఎక్కువగా పడనుంది.
కార్తీక మాసంలో పౌర్ణమి రోజున దేవతలదీపావళిగా జరుపుకుంటారు. దేవలతంతా భక్తులతో కలిసి జరుపుకునే ప్రత్యేక పండగే దేవతల దీపావళి.ద్రిక్ పంచాంగం ప్రకారం, 2024లో దేవతల దీపావళిని శుక్రవారం, నవంబరు 15న జరుపుకోవాలి. అప్పటివరకూ తిరోగమనంలో ఉన్న శని ఈ రోజున ప్రత్యక్షంగా మారనుంది. శని ప్రత్యక్ష మార్గంలో ఉండటం అంటే శని ఇప్పుడు నిటారుగా కదులుతుందని అర్థం. శని నేరుగా చూడటం వల్ల కొంతమందికి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మరి కొంతమందికి శనిసంచారం కొత్త కష్టాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారిపై శని సంచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
శని సంచారంతో ఈ రాశుల వారిపై ప్రభావం:
కుంభ రాశి: శని సంచారం సమయంలో కుంభరాశి వారు డబ్బును పెట్టుబడులు పెట్టే ముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్షక్యం వహించినా మీ డబ్బు చిక్కుకుకుపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా లాటరీ మొదలైన వాటిలో డబ్బును పెట్టుబడిగా అస్సలు పెట్టవద్దు.
మకర రాశి: శని ప్రత్యక్షంగా చూడటం వల్ల మకర రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తాయి. డబ్బు పరంగా చూస్తే మకర రాశి వారు బాగా ఆలోచించి అడుగేయాలి. ఆరోగ్యకపరంగా వీరికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.
మీన రాశి: శని సంచారం కారణంగా ఈ రాశి వారు వృత్తిపరంగా మంచి పురోగతిని పొందుతారు. కొంచెం కష్టపడితే ఉద్యోగులకు పదోన్నతులు, వేతనాలు పెరిగే అవకాశం ఉంది. ఆఫీసులో పనికి మీరు మంచి ప్రశంసలు పొందుతారు. మీరు మీ ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమయంలో ప్రయత్నిస్తే మీకు మంచి ఉద్యోగం అవకాశం ఉంది. కాకపోతే అదే సమయంలో మీరు మీ ఇంటిని నిర్షక్యం చేయకూడదు. వృత్తిని, కుటుంబ సమయానికి సమతుల్యత తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
మకర రాశి: తిరోగమనంలో ఉన్న శని ప్రత్యక్షంగా ఉండటం ఈ రాశి వారికి మంచి ఫలితాలను అందుతాయి.చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా శని మహాదశ ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన వారికి శని సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం పూర్తిగా సత్యం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వాటిని దత్తత తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణుల సలహా తీసుకోవాలి.
టాపిక్