Bilva Leaves to Shiva: శివుడుకి ఎందుకు బిల్వపత్రాలను సమర్పించాలి?, వీటిని సమర్పించేటప్పుడు చేయకూడని తప్పులు ఇవి-why we should worship with bilva leaves to shiva and do not do these mistakes while offering them ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bilva Leaves To Shiva: శివుడుకి ఎందుకు బిల్వపత్రాలను సమర్పించాలి?, వీటిని సమర్పించేటప్పుడు చేయకూడని తప్పులు ఇవి

Bilva Leaves to Shiva: శివుడుకి ఎందుకు బిల్వపత్రాలను సమర్పించాలి?, వీటిని సమర్పించేటప్పుడు చేయకూడని తప్పులు ఇవి

Peddinti Sravya HT Telugu

Bilva Leaves to Shiva: శివారాధనకు బిల్వ పత్రాలు ముఖ్యమైనవి. మహా శివరాత్రి నాడు పరమేశ్వరుడిని బిల్వ పత్రాలతో ఆరాధిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. బిల్వ పత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? బిల్వపత్రాల పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బిల్వపత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు చేయకూడని తప్పులు (pixabay)

హిందువులు మహా శివరాత్రి నాడు పరమేశ్వరుడిని ఆరాధించి, భక్తి శ్రద్దలతో ఉపవాసం, జాగరణ చేస్తారు. శివుడి పూజలో బిల్వపత్రం చాలా ముఖ్యమైనది. శివుడిని ఆరాధించేటప్పుడు బిల్వపత్రాన్ని తప్పక ఉపయోగిస్తారు.

అసలు శివుడికి, బిల్వ పత్రాలకు ఉన్న సంబంధం ఏంటి?, బిల్వ పత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? ఇటువంటి విషయాలని తెలుసుకుందాం.

బిల్వపత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు చేయకూడని తప్పులు

  1. శివారాధనకు ఉపయోగించేటప్పుడు మృదువైన ఉపరితలం వైపు మాత్రమే శివుడికి సమర్పించాలి.
  2. శివుడికి మూడు కంటే తక్కువ కాకుండా బిల్వ పత్రాలని సమర్పించి, భక్తిశ్రద్దలతో పూజించండి.
  3. బిల్వపత్రాలని తెంపి ఎప్పుడూ కూడా శివుడుని ఆరాధించకూడదు.
  4. మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలు త్రిమూర్తుల స్వరూపం. బిల్వపత్రాలను పెట్టేటప్పుడు మూడు, ఐదు ఇలా బేసి సంఖ్యలో ఉపయోగించడం మంచిది.
  5. బిల్వపత్రంతో శివుడిని పూజించేటప్పుడు మధ్య వేలు, ఉంగరం వేలు లేదా బొటనవేలు పట్టుకుని సమర్పించాలి.
  6. బిల్వపత్రాలతో శివుడును ఆరాధించేటప్పుడు వాటిని శుభ్రంగా కడిగి సమర్పించండి.
  7. బిల్వపత్రాలతో పూజ చేసాక నీటితో అభిషేకం చేస్తే శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.

బిల్వపత్రాల పురాణ కథ

సముద్రమధనం నుంచి వచ్చిన విషాన్ని శివుడు సేవించినప్పుడు శివుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గొంతు నీలం రంగులోకి మారింది. శరీర ఉష్ణోగ్రత పెరగడం వలన విశ్వం అగ్నికి ఆహుతమయింది. వేడి వలన భూమిపై ఉన్న వారందరూ జీవించడం కష్టంగా మారిపోయింది. సృష్టి ప్రయోజనం కోసం, సృష్టి ప్రయోజనానికి విష ప్రభావాన్ని తగ్గించడానికి దేవతలు శివుడికి బిల్వపత్రాలని సమర్పించారు.

బిల్వపత్యాలను సమర్పించిన తర్వాత విష ప్రభావం తగ్గింది. అందుకని అప్పటి నుంచి శివుడి పూజలో బిల్వపత్రాలని ఉపయోగించడం సాంప్రదాయంగా మారింది. అందుకే శివుడిని ఆరాధించేటప్పుడు తప్పక బిల్వ పత్రాలని అందరూ సమర్పిస్తూ ఉంటారు. శివరాత్రి నాడు శివుడుని ఆరాధించేటప్పుడు శివుడికి బిల్వపత్రాలతో పూజ చేస్తే శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం