Black Beads after Marriage: పెళ్ళి తర్వాత స్త్రీలు నల్లపూసలు ఎందుకు వేసుకోవాలో తెలుసా? కారణం ఇదేనట!-why we should wear black beads after marriage check its importance now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Black Beads After Marriage: పెళ్ళి తర్వాత స్త్రీలు నల్లపూసలు ఎందుకు వేసుకోవాలో తెలుసా? కారణం ఇదేనట!

Black Beads after Marriage: పెళ్ళి తర్వాత స్త్రీలు నల్లపూసలు ఎందుకు వేసుకోవాలో తెలుసా? కారణం ఇదేనట!

Peddinti Sravya HT Telugu

Black Beads after Marriage: ముత్తైదువులు ధరించే ఆభరణాల వెనుక చాలా ఆధ్యాత్మిక పరిణామాలు, వైజ్ఞానిక పరిణామాలు ఉన్నాయి. పెళ్లయిన తర్వాత స్త్రీలు నల్లపూసలు వేసుకుంటారు. వాటి వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడే చూసేద్దాం.

Black Beads after Marriage: పెళ్ళి తర్వాత స్త్రీలు నల్లపూసలు ఎందుకు వేసుకోవాలో తెలుసా? (pinterest)

పెళ్ళైన స్త్రీలు కచ్చితంగా కాళ్లకు మెట్టెలు పెట్టుకోవాలి. చేతులకు గాజులు వేసుకోవాలి. మెడలో తాళితో పాటుగా నల్లపూసలు ఉండాలి. అయితే, చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే, ఎందుకు నల్లపూసలు ధరించాలి అని.. నల్లపూసలు వేసుకుంటే ఎలాంటి లాభాలని పొందవచ్చు?, అసలు పెళ్ళైన స్త్రీలు ఎందుకు నల్లపూసలు వేసుకోవాలి? ఇలాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ముత్తైదువులకి ఆభరణాలు

ముత్తైదువులు ధరించే ఆభరణాల వెనుక చాలా ఆధ్యాత్మిక పరిణామాలు, వైజ్ఞానిక పరిణామాలు ఉన్నాయి. స్త్రీ నాడులకు అనుకూలంగా ఉండేలా ఆభరణాలు రూపొందించడం జరిగింది. స్త్రీ ధరించే వాటిలో ఈ నల్లపూసలు కూడా ఒకటి. పెళ్లయిన తర్వాత స్త్రీలు నల్లపూసలు వేసుకుంటారు. దాని వెనక చాలా పెద్ద కారణమే ఉంది.

స్త్రీలు నల్లపూసలు ఎందుకు వేసుకోవాలి?

  1. ఇప్పుడు బంగారం నల్లపూసల్ని ఎక్కువమంది వేసుకుంటున్నారు. లేదంటే నల్లపూసలు డైమండ్ లాకెట్స్ తో వస్తున్నాయి. కానీ పూర్వకాలంలో చూసుకుంటే, నల్ల మట్టితో వీటిని తయారు చేసేవారు. నల్ల పూసలు వేసుకుంటే ఛాతిపై ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకోవడం వలన ఎంతో లాభం ఉంటుంది.
  2. నల్లపూసలు వేసుకుంటే బాలింతలకు కూడా ప్రయోజనాలు కలుగుతాయి.
  3. ఇప్పుడు చాలామంది బంగారం నల్లపూసలు వేసుకుంటున్నారు. దాని వలన ఇంకా వేడి పెరుగుతుంది.

నీల లోహిత గౌరికి పూజలు

  1. ఇది వరకు మంగళసూత్రంతో పాటే నల్లపూసలు కూడా ఉండేవి. ఈ విషయాన్ని పక్కన పెడితే, నల్లపూసలు వధూవరులు చేత నీలలోహిత గౌరికి పూజలు చేయించేవారు.
  2. ఇలా చేయడం వలన నీలలోహిత గౌరి అనుగ్రహంతో పాటుగా, వధువు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని నమ్మేవారు.
  3. నల్లపూసలకు పూజ చేసి ఆ తర్వాత వధువు ధరించడం వలన జాతక దోషాలు, సర్ప దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.

మరో కారణం

నల్లపూసలు దంపతులపై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉండడానికి.. ఎటువంటి దుష్టశక్తులు వారిని ఏమీ చేయకూడదని ఉద్దేశంతో పెళ్లయిన స్త్రీలను ధరించమని చెప్తారు.

నల్లపూసలు వేసుకుంటే హృదయం, గొంతు భాగాల్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి నయమవుతాయట. నల్లపూసలు వేసుకుంటే స్త్రీలు కేవలం పాజిటివ్ వైబ్రేషన్స్ ని మాత్రమే పొందవచ్చట.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం