నెలసరి సమయంలో ఎందుకు ఊరగాయలు తాకకూడదని అంటారు? దాని వెనుక కారణం తెలుసా?
నెలసరి సమయంలో పచ్చళ్లను, అప్పడాలు మొదలైన వాటిని ముట్టుకోకూడదని చెప్తూ ఉంటారు. ఊరగాయలు వంటి వాటిని తాకడం నిషిద్ధం. ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు కూడా పదేపదే ఈ విషయాలని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటిని ముట్టుకోవద్దు అని చెప్పడాన్ని మీరు కూడా వినే ఉంటారు.
పూర్వకాలం నుంచి అనేక పద్ధతుల్ని మనం అనుసరిస్తూ ఉన్నాము .పెద్ద వాళ్ళు చెప్పిన పద్ధతుల్ని కూడా మనం పాటిస్తూ ఉంటాము. అయితే, కొన్ని పనులు వాళ్ళు చెప్పినట్లు చేస్తాం కానీ ఎందుకు చేస్తాం అనేది తెలీదు. అమ్మమ్మలు, నానమ్మలు మన జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తారు. వారి సలహాలు భవిష్యత్తులో మనకి ఎంతగానో అవసరమవుతాయి.
ప్రస్తుత సమస్యల నుంచి మనల్ని కాపాడడానికి కూడా సహాయపడతాయి. అయితే, పురాతన కాలం నుంచి వస్తున్న పద్ధతులు విషయానికి వస్తే చాలా మంది వాటిని పాటిస్తూ ఉంటారు. కానీ దానికి గల కారణం ఏంటనేది తెలియదు.
రుతుక్రమం గురించి చెప్పాలంటే, భారత సమాజంలో ఇప్పటికి కూడా ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి. నేటి ఆధునిక జీవితంలో కొన్ని విషయాలు అపోహలుగా అనిపించొచ్చు. కానీ, నెలసరి సమయంలో పాటించాల్సిన కొన్ని పద్ధతులను ఇంకా చాలా మంది పాటిస్తూ ఉంటారు.
నెలసరి సమయంలో పచ్చళ్లను, అప్పడాలు మొదలైన వాటిని ముట్టుకోకూడదని చెప్తూ ఉంటారు. ఊరగాయలు వంటి వాటిని తాకడం నిషిద్ధం. ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు కూడా పదేపదే ఈ విషయాలని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటిని ముట్టుకోవద్దు అని చెప్పడాన్ని మీరు కూడా వినే ఉంటారు.
నెలసరి సమయంలో ఇవి కూడా చేయకూడదని అంటుంటారు..
- నెలసరి సమయంలో ఊరగాయలు ముట్టుకోవడం
2. తలస్నానం
3. కుటుంబంతో కలిసి నిద్రించడం
4. గుడికి వెళ్లడం
5. మొక్కలకు నీళ్లు పోయడం
6. ఆహారం వండడం
నెలసరి సమయంలో ఊరగాయలు ఎందుకు ముట్టుకోకూడదు?
ఈ సమయంలో ఊరగాయల్ని ముట్టుకోవద్దని పెద్ద వాళ్ళు చెప్తారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్వకాలంలో నెలసరి సమయంలో మహిళలు ఊరగాయలు ముట్టుకునే వారు కాదు. ఈ సమయంలో మహిళలు వంట గదిలోకి ప్రవేశించడం కూడా నిషేధించబడింది.
నెలసరి సమయంలో స్త్రీలు అపవిత్రమవుతారని నమ్మేవారు. ఈ నమ్మకం వెనుక ఉన్న కారణం ఏంటంటే ఆహారాన్ని ప్రసాదంగా పరిగణించేవారు. వంటగదిని పూజా స్థలంగా భావించేవారు.
అందుకని పూర్వకాలంలో నెలసరి సమయంలో ఊరగాయలను తాకడం లేదా వంటగదిలోకి వెళ్లడం నిషేధించబడింది. ఇప్పటికి కూడా చాలా మంది ఈ నమ్మకాలను అనుసరిస్తున్నారు. పీరియడ్స్ సమయంలో పచ్చళ్ళని ముట్టుకోకుండా ఉంటున్నారు, అయితే శాస్త్రీయ కారణం అయితే లేదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం